ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు రేపిస్టులు: అసదుద్దీన్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఇరాక్, సిరియాల్లో నరమేథం సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మిలిటెంట్లపై మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లను ఆయన హంతకులు, రేపిస్టులతో పోల్చారు. ఐసిస్ మిలిటెంట్లు ఏం చేస్తున్నారో చూస్తున్నామని, ఇస్లామిక్ గురువులు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
వాళ్లు మనుషులను చంపుతున్నారని, అత్యాచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అత్యంత క్రూరంగా హత్యలు చేస్తున్నారని, తలలూ చేతులూ నరుకుతున్నారని, మనుషులను తగులబెడుతున్నారని, ఇటువంటి పనులు చేయాలని ఇస్లాం బోధించడం లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాలని ఆయన అన్నారు.
హైదరాబాదు యువత ఐసిస్‌లో చేరుతున్నారనే ప్రచారంపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. హజరత్ అన్వరుల్లా ఫరూఖీ 100వ వర్ధంతి సభలో ఆయన ఆయన ప్రసంగించారు. యువకులు ఐసిస్‌లో చేరడానికి అంత దూరం ఎందుకు వెళ్లాలని, చుట్టుపక్కల చాలా దురాగతాలున్నాయని, వాటిపై పోరాటం చేయాలని ఆయన యువతకు ఉద్బోధించారు.

ఇస్లామ్‌తో సంబంధం లేదు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) సంస్థకు ఇస్లాంతో సంబంధం లేదని, ఆ సంస్థ కార్యకర్తలు రేపిస్టులు, హంతకులు అని అఖిల భారత మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఇస్లాం ప్రోత్సహించదు
ఉగ్రవాద కార్యకలాపాలను ఇస్లాం ఏనాడు ప్రోత్సహించదని, ఇస్లాంలో అలాంటి వాటికి స్థానం లేదన్నారు. వీరి చర్యలను యావత్ ముస్లిం విద్యావేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు.

శతాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్ హుస్సేనీ ఆలంలోని ప్రసిద్ధ జామే నిజామియా ఇస్లామిక్ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం గురువారం వర్సిటీ ప్రాంగణానికి వచ్చిన అసద్ మీడియాతో మాట్లాడారు.

నిరక్షరాస్యతపై జిహాద్
జీహాద్ అంటే పవిత్రయుద్ధమని, భారతదేశంలో ముస్లింల నిరక్షరాస్యతపై జిహాద్ చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications