నగిరిలో నగరానా, రోజా చెవిలో పువ్వులు పెట్టిన సొంత పార్టీ క్యాడర్ ?, ఎక్కడ చూసినా అదే టాపిక్ !

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల నాయకులు గెలుపు ధీమాతో ఉన్నారు. పలు నియోజక వర్గాల్లో ఓడిపోతామని ముందే తెలిసినా ఆ నాయకులు పైకి మాత్రం మేకపోతు గంభీర్యంతో నేనే గెలుస్తా అంటూ వారి అనుచరుల దగ్గర, కార్యకర్తల దగ్గర చెబుతున్నారు. పోలింగ్ పూర్తి కావడంతో ఎవరి లెక్కల్లో వారు బిజీగా ఉన్నారు.

చిత్తూరు జిల్లాలోని నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో మంత్రి ఆర్ కే రోజా మరోసారి పోటీ చేశారు. హ్యాట్రిక్ మీద కోటి ఆశలు పెట్టుకున్న మంత్రి రోజాను సొంతపార్టీ వైసీపీలోని కొందరు నాయకులు ముంచేశారని నగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు. సినీనటిగా తన గ్లామర్ తో మొదటిసారి అతి తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన రోజా తరువాత రానురాను ప్రత్యర్థి పార్టీ నాయకులకు చుక్కలు చూపించారు.

It is learned that the vote was taken against Minister RK Roja in Nagiri

గుడ్డికన్న మెల్లమేలు అనే సామెతతో మొదటిసారి కంటే రెండోసారి కొంచెం ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని ఎమ్మెల్యే అయిన ఆర్ కే రోజాకు అడ్డుకట్ట వేసేనాయకులు కరువైనారు. రోజా రెండోసారి ఎమ్మెల్యే అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పాటు సీఎం జగన్ సపోర్ట్ ఫుల్ గా ఉండటంతో రోజా హవా మొదలైయ్యిందని వైసీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. తరువాత నగిరిలో రోజా తీరులో మార్పు వచ్చిందని ప్రజలు ఆరోపించడం మొదలుపెట్టారు.

సీఎం జగన్ ను ఎవరైనా ఒక్కమాట అంటే రోజా వాళ్లకు పట్టపగలు చుక్కలు చూపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు తిట్టిన రోజా నిత్యం వార్తల్లో నిలిచారు. జగన్ ప్రభుత్వంలో రెండ విడత మంత్రి పదవులు పంపకాలు జరిగిన సమయంలో మంత్రి రోజా మంత్రి పదవి దక్కించుకున్నారు.

It is learned that the vote was taken against Minister RK Roja in Nagiri
అప్పటికే రోజా మీద వైసీపీలో వ్యతిరేకత రావడం, ఆమె మంత్రి అయిన తరువాత ఆమె తీరులో ఇంకా మార్పులు రావడంతో నగిరితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ నాయకులు మేడమ్ తీరును జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి నగిరిలో రోజాకు వైసీపీలోనే వ్యతిరేక పవనాలు మొదలైనాయి. రోజాను గెలిపించడం కోసం నగిరి నియోజక వర్గంలో సీఎం జగన్ బహిరంగ సభ కూడా పెట్టారు.

అయినా రోజా గెలుపుకు మాత్రం పని చెయ్యమని కొందరు వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రోజా మీద ఉన్న వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడంతో నగిరి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గాలి భానుప్రకాష్ వియం సాధించారు. నగిరిలో దూసుకుపోయిన గాలి భానుప్రకాష్ ప్రజలను ఆకట్టుకుని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని మనవి చేశారు. మొత్తం మీద నగిరిలో సోమవారం జరిగిన పోలింగ్ తీరు, అదే రోజు రాత్రి నుంచి నగిరి నియోజక వర్గం ప్రజలు మాట్లాడుకుంటున్న తీరు గమనిస్తే గాలి భానుప్రకాష్ విజయం సాధిస్తారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+