పూల వ్యాపారి ఆస్తులు రూ.3 కోట్లకు పైగా.. ఐటీ అధికారులే షాకయ్యారు

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఓ పూల వ్యాపారి నివాసంలో ఐటీ అధికారులు రూ.3 కోట్ల ఆస్తులను గుర్తించారు. ఇది విని స్థానికులు ఆశ్చర్యపోయారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడికి రఘు పూలను సరఫరా చేస్తాడు. అతని నివాసంలో మంగళవారం ఐటీ అధికారులు సోదాలు చేశారు.

ఇన్నాళ్లు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిన ఆయన వ్యాపారానికి మంగళవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులతో ఝలక్‌ ఇచ్చారు. చిత్తూరు నగరానికి చెందినర రఘు ఇంట్లో మంగళవారం రాత్రి ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు.

బ్యూటీషియన్‌తో వారికి విభేదాలు

రూ. 2.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాణిపాకంలోని ఆయన కళ్యాణ మండపంలో మరో రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు ఖాతాల్లోని నగదు, లాకర్లు, డాక్యుమెంట్లు వంటి వాటిపై దృష్టి సారించారు. ఆయన ఆస్తులు చూసి అధికారులే షాకయ్యారట.

సాదా సీదా పూల వ్యాపారి ఆయిన రఘుకు ఇంత పెద్ద మెత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కాణిపాకంలో స్వామి వారికి పుష్పాలను అందించే సాధారణ వ్యక్తి... అనతి కాలంలోనే రూ.కోట్లు గడించడంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

IT official recover cash, seize property worth Rs 3 crores from AP floer merchant

తొమ్మిదేళ్ల సుదీర్ఘీ కాలంగా ఆయనకే కాంట్రాక్టు అప్పగించడంపైనా సందేహాలు ముసురుకుంటున్నాయి. కాణిపాకంలో ఆయన ఆస్తులు సుమారు రూ.3 కోట్లపైన ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

ఇటీవలే వరసిద్దుని ఆలయ సమీపంలో రూ.2.5 కోట్లు విలువచేసే జేకేఆర్‌ అనే పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మించి, ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఆలోచనతో నిర్మాణం పూర్తయిన తర్వాత వివిధ బ్యాంకుల నుంచి రుణం పొందారు.

అక్కడే దొరికిపోయాడు

అక్కడే ఐటీ అధికారులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు ఐటీ శాఖకు చూపాల్సిన లెక్కలను చూపలేదు. పన్ను చెల్లించలేదు. నూతన పన్ను విధానంతో ఆస్తుల విలువలో లెక్క చూపని కారణంగా రూ. 1.5 కోట్లు (87 శాతం) చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు.

కాణిపాకంలోనే రఘు సమీప బంధువుల పేరుతో బినామీ ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించారు. భార్య, బావమరిది పేరుతో ఆస్తులున్నాయి. చిత్తూరు నగరంలోని కొత్త బాలాజీ కాలనీలో ఒక ఇల్లు, కాణిపాకంలో రెండు ఇళ్లు, వివిధ ప్రాంతాల్లో భూములు, లెక్క చూపని పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
People of Chittoor town must been amused with IT officials, as they carried out a raid at Raghu's residence, who is known as flower merchant in the locality.
Please Wait while comments are loading...