సీమాంధ్రులు దోచుకుంటే: జానాను ఏకేసిన జగదీశ్వర్‌రెడ్డి

Jagadeeshwar Reddy lashes out at Jana Reddy
నల్గొండ: తెలంగాణ శాసనసభా పక్షనేత జానా రెడ్డి పైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పదవులు అనుభవిస్తున్న జానారెడ్డి ఏనాడు ప్రజా సంక్షేమం కోసం చూడలేదన్నారు. నల్గొండ జిల్లా సమీక్షా సమావేశాలు ఆయన ఎప్పుడు హాజరు కాలేదని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి సీమాంధ్రులు నీటిని దోచుకుపోతుంటే పెదవి విప్పలేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. జానా ఆంధ్రోళ్లకు తొత్తులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులను రెచ్చగొడుతోంది జానా రెడ్డియే అన్నారు.

ఆయన మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడిందన్నారు. జానా హయాంలోనే ఉద్యమకారుల పైన దాడులు జరిగాయన్నారు. త్వరలో నల్గొండ జిల్లా ప్రజలు జానాకు బుద్ధి చెబుతారన్నారు. వాగ్ధానాలు మినహా జానా ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన తమకు స్పష్టత ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఆగస్టు 4 తర్వాత అడ్మిషన్ల పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+