జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు
క్విడ్ ప్రోకో సంబందిత కేసుల్లో నిందితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్(నాంపల్లి) సీబీఐ కోర్టులో సోమవారం జరిగిన విచారణ తీరుతెన్నుల్ని పిటిషనర్ రఘురామ మీడియాకు వెల్లడించారు. వివరాలివి..
జగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామ '

సీబీఐ మళ్లీ టైమ్ కోరడంతో..
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ వేసిన దావాపై సోమవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రఘురామ, జగన్ తరఫు లయర్లు లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పించారు. తొలుత నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసిన సీబీఐ.. ఆ తర్వాత తాము కూడా లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పిస్తామని చెప్పడంతో జడ్జి టైమిచ్చారు. ఇవాళ సీబీఐ రిజాయిండర్ వేయాల్సి ఉండగా, అందుకు మరింత సమయం కావాలని కోర్టుకు తెలిపింది. దీంతో జడ్జి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. అయితే, రాబోయే వాయిదానే చివరిది కావొచ్చని పిటిషన్ రఘురామ అంటున్నారు..
Recommended Video

విక్రమార్కు-బేతాళుడు కథలా
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ శుక్రవారానికి(ఈనెల 30కి) వాయిదా పడిన తర్వాత పిటిషనరైన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ వాళ్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా, వారి తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుంచి మాత్రం సరైన మద్దతు లభించనట్లుగా పరిస్థితి ఉందని, విక్రమార్కుడు-బేతాళుడు కథలా, ప్రతిసారీ కేసు వాయిదా పడటం, మళ్లీ సీబీఐ లాయర్లు టైమ్ కోరడం పరిపాటిగా మారిందని, కనీసం లాయర్లను మార్చుకునే దిశగా సీబీఐ ఆలోచన చేయాలని రఘురామ అన్నారు..

జగన్ బెయిల్ రద్దు, చివరి అవకాశం?
''సరిగ్గా కీలకమైన జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ రోజే దుదృష్టవశాత్తూ, సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇద్దరికీ జ్వరం వచ్చింది. వాళ్లకు వచ్చింది కరోనా కూడా కావొచ్చేమో. ఒకవేళ కరోనానే అయితే, ఈనెల 30న జరగాల్సిన తదుపరి విచారణకు కూడా ఇబ్బందులు కలగొచ్చు. మరి నిజంగా లాయర్లకు వచ్చిన జ్వరం కరోనాగా మారకముందే, మరోసారి విచారణ వాయిదా పడకముందే సీబీఐ వాళ్లు వేరే లాయర్లనైనా పెట్టుకొని కేసును త్వరగా ముగించాలని కోరుతున్నాను. ఎలాగూ జరిగేది లిఖిత పూర్వక వాదనలే కాబట్టి, ఆ పీపీలు రాసిచ్చినా సరిపోతుంది. నా అంచనా నిజమైతే, ఈ 30వ తేదీన గనుక సీబీఐ రిజాయిండర్ వేయకుంటే, ఇక జడ్జిగారు వాదనలు ప్రారంభించే అవకాశాలే ఎక్కువ'' అని పిటిషన్ రఘురామ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications