జగన్ బెయిల్ రద్దు కేసు- మరింత సమయం కోరిన సీఎం- జూన్ 1 డెడ్‌లైన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇప్పటివరకూ ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న వైఎస్ జగన్ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఇవాళ మరోసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది.కౌంటర్ దాఖలు కోసం సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే రెండుసార్లు వాయిదా కోరారు. ఇవాళ మరోసారి కౌంటర్ దాఖలుకు మరింత గడువు కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 1న ఈ కేసుపై విచారణ చేపడతామని, అప్పటికల్లా కౌంటర్ దాఖలు చేయాలని, లేకుంటే నేరుగా విచారణ చేపడతామని హెచ్చరించింది.

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న సీఎం జగన్‌పై ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో విచారణ నానాటికీ ఆలస్యమవుతోంది. దీంతో ఈ విచారణ త్వరగా పూర్తి చేయాలని, సీఎం జగన్‌కు గతంలో మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికే మూడుసార్లు విచారణకు వచ్చినా జగన్‌తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఆలస్యమవుతోంది. జగన్, సీబీఐ కౌంటర్లు అందితే దీనిపై సీబీఐ కోర్టు విచారణ జరిపేందుకు అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications