వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గులేకుండా అబద్ధాలా.. అది చంద్రబాబు ఘనత; డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం: లోకేష్

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి ప్రభుత్వ తీరుపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం, గత ప్రభుత్వం చేసిన మంచిపనిని తమ ఖాతాలో వేసుకోవడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఆలిండియా హైయర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీ అగ్రగామిగా నిలవడం తమ ఘనత అని చెబుతున్న ముఖ్యమంత్రి తీరుపై లోకేష్ నిప్పులు చెరిగారు.

యూనివర్సిటీలు వైసీపీ కార్యాలయాలుగా.. ఆధిపత్యమంతా రెడ్లదే: ఆ వీడియో పోస్ట్ చేసి లోకేష్ ఫైర్!!యూనివర్సిటీలు వైసీపీ కార్యాలయాలుగా.. ఆధిపత్యమంతా రెడ్లదే: ఆ వీడియో పోస్ట్ చేసి లోకేష్ ఫైర్!!

 సిగ్గు లేకుండా జగన్ రెడ్డి అబద్దాలు: నారా లోకేష్

సిగ్గు లేకుండా జగన్ రెడ్డి అబద్దాలు: నారా లోకేష్

అఖిల భారత ఉన్నత విద్యా సర్వేలో అగ్రగామిగా ఏపీ తమ ప్రభుత్వం వల్లే నిలిచిందని ముఖ్యమంత్రి సిగ్గులేకుండా చెబుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఏప్రిల్ 1, 2018 నుంచి 2019 మార్చి 31 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, విద్యా ప్రమాణాల ఆధారంగా సర్వే నివేదిక రూపొందించిందని, 2018- 2019 అంటే టీడీపీ హయాంలో కాదా అంటూ ప్రశ్నించారు. తప్పులైతే గత ప్రభుత్వాలపై నెట్టడం, ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనంగా మారిపోయిందని నారా లోకేష్ మండిపడ్డారు.

హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీ ముందుండటం చంద్రబాబు ఘనత

హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీ ముందుండటం చంద్రబాబు ఘనత


ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీ ముందుండటం వైసీపీ ప్రభుత్వ ఘనతే అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిగ్గులేకుండా అబద్దాలు ఆడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో, స్థూల నమోదు నిష్పత్తి దేశంలో 3.04 శాతం ఉంటే ఏపీలో 8. 64 శాతం ఉందంటే ఇది పెరగడానికి కారణం నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని లోకేష్ స్పష్టం చేశారు.

Recommended Video

జగన్ ను గద్దె దించాలి అంటే అందరూ కలిసి రావాల్సిందే....*Political | Telugu OneIndia
 జగన్ ఆ వ్యసనం నుండి బయటపడాలి

జగన్ ఆ వ్యసనం నుండి బయటపడాలి


చంద్రబాబు డ్రాపవుట్స్ ని తగ్గించేందుకు 2000వ సంవత్సరంలోనే మళ్లీ బడికి అనే కార్యక్రమానికి శ్రీకారం చెప్పారని లోకేష్ గుర్తు చేశారు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీకి వచ్చిన మెరుగైన ఫలితాల్లో జగన్ రెడ్డికి ఎలాంటి క్రెడిట్ లేదని, ఆయన చేసింది జీరో అని లోకేష్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఇకనైనా ఇతరుల ఘనతని తనదని చెప్పుకోవటం అనే వ్యసనం నుంచి బయటపడాలి అని లోకేష్ హితవు పలికారు.

ఇదిలా ఉంటే విద్యారంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనేక

ఇదిలా ఉంటే విద్యారంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనేక

కార్యక్రమాలను చేపడుతోందని ఉన్నత విద్యలో గరిష్ఠ స్థాయిలో చేరికలు నమోదవుతున్నాయని ఏపీ ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నత విద్యా సంస్థల్లో చేరికల నిష్పత్తి అధికంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆలిండియా సర్వే హైయర్ ఎడ్యుకేషన్ గణాంకాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, జాతీయ స్థాయిలో ఏపీ ఉన్నత విద్య లో రికార్డ్ స్థాయి చేరికలతో ముందుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే నారా లోకేష్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు.

English summary
TDP general secretary Nara Lokesh slams jagan that it has become a habit of Chief Minister YS Jagan to blame the previous governments for his mistakes and take credit for the previous government’s good work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X