మంత్రి లోకేష్‌ను ర్యాగింగ్ చేసిన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకున్న జగన్, కూటమి ప్రభుత్వంపై తనదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దారుణ ఓటమి తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రారని కూటమి నేతలు ప్రచారం చేశారు. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆయన అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పార్టీ కార్యకర్తల హత్యలపై గళం ఎత్తిన జగన్, ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై ఢిల్లీకి వెళ్లి మరి ధర్నా నిర్వహించారు.
జాతీయ స్థాయిలో వైసీపీకి మద్దతు కూడగట్టడంలో జగన్ విజయవంతం అయ్యారనే చెప్పాలి. ఢిల్లీ ధర్నా సక్సెస్ కావడంతో జగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్ , తన పాలనలో జరిగిన సంక్షేమం, అప్పుల గురించి వివరించారు.ఈక్రమంలో కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి చంద్రబాబు పచ్చి అబ్బద్దాలు చెబుతున్నారని జగన్ దుయ్యబట్టారు. 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎందుకు చెప్పడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.

మరోవైపు తల్లికి వందనం గురించి కూడా జగన్ స్పందించారు. అమ్మవడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా పెట్టారని, కాని ఆ తల్లుల నెత్తిన శఠగోపం పెట్టారని కూటమి ప్రభుత్వాన్ని ఎద్దెవా చేశారు. జగన్ లేకపోయే సరికి తల్లులకు ఇవ్వాల్సిన రూ.15000 రూపాయిలు పోయాయని .. తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తానని చెప్పడం నిజంగా సిగ్గు చేటని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 43 లక్షల తల్లులకు అమ్మఒడి ఇచ్చామనే విషయన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని జగన్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో తల్లికి వందనం గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలకు జగన్ కౌంటరిచ్చారు.
నారా లోకేష్‌కు కౌంటరిచ్చిన వైఎస్ జగన్.!#YSJagan #NaraLokesh #APPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/Z96WjcLsdx
— oneindiatelugu (@oneindiatelugu) July 26, 2024
ప్రభుత్వం దగ్గర తల్లులు, పిల్లలకు సంబంధించిన డేటా లేదని తప్పించుకుంటుందని, మీ దగ్గర డేటా లేకపోతే ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉన్నారని, వారిని స్కూళ్లకు పంపించి తల్లులు, వారి పిల్లలకు సంబంధించిన డేటాను అడిగి తెప్పించుకోవచ్చని మంత్రి నారా లోకేష్‌కు జగన్ కౌంటరిచ్చారు. దీనికి మళ్లీ మా దగ్గర డేటా లేదని తప్పించుకుంటున్నారని ఎద్దెవా చేశారు. 43 లక్షలు తల్లులు, 84 లక్షల పిల్లలు ఇది డేటా అని ...దీనికి మళ్లీ ఓ డేటా డేటా అంటూ గగ్గోలు పెడుతున్నారంటూ మంత్రి నారా లోకేష్‌ను జగన్ ర్యాగింగ్ చేసినంత పని చేశారు












Click it and Unblock the Notifications