పవన్‌ని లెక్కలోకి తీసుకోవడం లేదా ..? భీమవరంలో టార్గెట్ టీడీపీగా జగన్ ప్రచారం!

ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో వారం రోజుల్లో ముగియ‌నుంది. అన్ని పార్టీల అధినేతలు త‌మ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నా రు. వైసిపి అధినేత జ‌గ‌న్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేస్తున్న భీమ‌వ‌రం లో ఎన్ని క‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. త‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించ లేదు. టిడిపి నే లక్ష్యంగా చేసుకొని ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగించారు. కీల‌క హామీల‌ను ప్ర‌స్తావించారు.

భీమ‌వ‌రంలో జ‌గ‌న్ స‌భ‌..

భీమ‌వ‌రంలో జ‌గ‌న్ స‌భ‌..

ప‌శ్చిమ గోదావ‌రి లో వైసిపి అధినేత జ‌గ‌న్ భీమ‌వ‌రంలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. స‌భ‌కు పెద్ద ఎత్తున ఈ స‌భ‌కు త‌ర‌లి వ‌చ్చారు. భీమ‌వ‌రం నుండి జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ బ‌రిలో ఉన్నారు. అయితే, జ‌గ‌న్ అక్క‌డ పోటీ లో ఉన్న ప‌వ‌న్ పేరును ఎక్క‌డా ప్రస్తావించ లేదు. త‌న స‌హ‌జ ధోర‌ణిలో అక్క‌డ కూడా వైసిపి..టిడిపి మ‌ధ్యే ప్ర‌ధా న పోటీ అనే విధంగా త‌న ప్ర‌చారం కొన‌సాగించారు. తాను అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేసే సంక్షేమ ప‌ద‌కాల పైనే ఎక్కువ‌గా ప్ర‌స్తావించారు. ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు తెచ్చేలా చ‌ట్టం తెస్తామ‌ని హామీ ఇచ్చారు. భీమ‌వ‌రంలో స్థానిక స‌మ‌స్య‌లైన మంచినీటి అంశం..బ్రిడ్జి విష‌యాల‌ను ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. దేశంలో అతి పేద రైతులు ఏపిలో ఉంటే..అత్యంత ధ‌నిక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అని వివ‌రించారు.

ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం..

ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం..

తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ జ‌న‌వ‌రిలో ఉద్యోగాల భ‌ర్తీ కేలండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. గ్రామ స్థాయిలో స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసి..ఆ గ్రామ‌స్థుల‌కే అందులో ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం నుండి ఏ సాయం కావాల‌న్ని అదే స‌చివాల‌యం నుండి 72 గంట్లోనే అన్నీ అందుబాటులోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పాలని పిలుపునిచ్చారు.

ప్ర‌త్యేక హోదా సాధిస్తాం..

ప్ర‌త్యేక హోదా సాధిస్తాం..

ఇక‌, పేద‌వారికి ఫ్లాట్ల పేరుతో చంద్ర‌బాబు మోసం చేస్తున్నార‌ని..చంద్ర‌బాబు ఇచ్చే ఫ్లాట్లు తీసుకోవాల‌ని సూచించిన జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే వారి పేరు మీద ఉన్న అన్ని బ‌కాయిల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఏపి కి ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే ఏపి అభివృద్ది సాధ్యం అవుతుంద‌న్నారు. అందుకోసం వైసిపి కి చెందిన 25 మంది ఎంపీల‌ను గెలిపించాల‌ని కోరారు. కేంద్రం లో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే వారికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తే ఉద్యోగావ‌కాశాలు వ‌స్తాయ‌ని..పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చి రాష్ట్రం స‌మ‌గ్రాభివృద్ది సాధ్యం అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. అయితే, ప‌వ‌న్ పైన జ‌గ‌న్ ఎటువంటి కామెంట్లు చేస్తార నే అంశం పై అంద‌రూ ఆస‌క్తి చూపించారు. అయితే, జ‌గ‌న్ మాత్రం ఎక్క‌డా ప‌వ‌న్‌ పేరు ప్రస్తావించ‌కుండా త‌మ అభ్య ర్దుల‌ను గెలిపించాల‌ని అభ్య‌ర్దించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+