సీఎం జగన్ పై ఒత్తిడి -లాబీయింగ్ : స్వామీజీలు- పొరుగు రాష్ట్ర నేతలు : కేబినెట్ బెర్తు కోసం పోటీ..!!
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. మంత్రులందరూ ఇప్పటికే రాజీనామా చేసారు. కొత్తగా మంత్రివర్గం ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. దీంతో..సీఎం తన కేబినెట్ తది కూర్పు లో బిజీగా ఉన్నారు. ప్రస్తుత కేబినెట్ లో పది మంది వరకు కొనసాగుతారని.. కొత్త వారికి మరో 14 మంది వరకు అవకాశం ఉంటుందని తాజాగా అందుతున్న సమచారాం. దీంతో...తిరిగి మంత్రివర్గంలో స్థానం సంపాదించటం కోసం తాజా మాజీ మంత్రులు... కొత్తగా ఛాన్స్ కోసం ఆశావాహులు తమ వంతు ప్రయత్నాల్లో బిజీగా మారారు.

పైకి సంతోషం..లోలోపల అసంతృప్తి
ఇక, మాజీలంతా తాము సీఎం అప్పచెప్పిన బాధ్యతలు సంతోషంగా స్వీకరిస్తా మని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొంత మంది తమను తప్పించటం పైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో..రాజీనామా చేసిన మంత్రుల తీరు పైన సీఎం సన్నిహితులు కన్నేసి ఉంచారు. వారి తీరును గమనిస్తున్నారు. అయితే, సీఎం ఎవరి మాటకు ప్రాధాన్యత ఇస్తారో అవగాహన ఉన్న తాజా మాజీ మంత్రులు..ఆశావాహులు తమ బెర్తు ఖరారు చేసుకొనేం దుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. కొందరు ఆశావాహులు దేవాలయాల దర్శనాలు కొనసాగిస్తున్నారు. దేవుడి ఆశీస్సులు ఉంటే సీఎం మనసు మారుతుందేమోననే ప్రయత్నాలు చేస్తున్నారు.

గుడులు..స్వామీజీల చుట్టూ ప్రదిక్షణలు
ప్రస్తుతం ఒక కీలక పదవిలో ఉన్న సీనియర్ నేత సైతం మంత్రివర్గంలో బెర్తు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా తన కోరిన నెరవేరటం కోసం హోమం సైతం చేయించారని సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ఒక ప్రముఖ ఆశ్రమానికి చెందిన స్వామిజీ చెబితే సీఎం జగన్ నో అనరని..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ఆ స్వామిజీని ప్రసన్నం చేసుకొని..అటు నుంచి సీఎంను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని విశాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాయలసీమలో ఒక జిల్లాల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య మంత్రి పదవి కోసం పోటీ నెలకొని ఉంది. సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న పొరుగు రాష్ట్ర ప్రముఖ పారిశ్రామిక వేత్త ద్వారా ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లాబీయింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక - తెలంగాణ నుంచి సిఫార్సులు
కర్ణాటక..తెలంగాణలోని సీఎం జగన్ సన్నిహితంగా ఉండే పలు రంగాలకు చెందిన ప్రముఖుల ద్వారానూ కొందరు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత అందరినీ తప్పిస్తానని చెప్పటం ద్వారా..తాజాగా రాజీనామా చేసిన మంత్రులు దీనిని పాలసీ నిర్ణయనే భావనతో మన్నికుండిపోయారు. అయితే, ప్రస్తుత మంత్రుల్లోనూ పది మంది వరకు తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలియటంతో..తమ లాబీయింగ్ ముమ్మరం చేసారు. మరి కొందరు తమకు మంత్రి పదవిలో కొనసాగించకుంటే జిల్లాల్లో ఏర్పడే పరిస్థితులు..తమ రాజకీయ భవిష్యత్ కు జరిగే నష్టం గురించి నేరుగా సీఎంకు తెలిసే విధంగా పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే, సామాజిక సమీకరణాల కారణంగా ఎవరికి మంత్రి పదవులు కొనసాగుతాయి.. కొత్తగా దక్కుతాయనేది పెద్ద పజిల్ గా మారుతోంది.
Recommended Video


సీఎం జగన్ నిర్ణయం పై ఉత్కంఠ
కేబినెట్ కూర్పుతో పాటుగా మంత్రి పదవి కోల్పోయిన వారి కోసం జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటు పైనా సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, సీఎం మాత్రం తనకు రాజకీయంగా ఎవరి శక్తిని పార్టీకి- ప్రభుత్వానికి ఏ మేర ఉపయోగపడుతుందో..వారిని గుర్తించి ఎంపిక జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పది మంది కంటిన్యూ అవటం ఖాయంగా కనిపిస్తుండటంతో..మిగిలిన స్థానాలు కొత్త వారితో భర్తీ చేయనున్నారు. అందుకోసం సామాజిక - ప్రాంతీయ సమీకరణాలే కీలకం కానున్నాయి. దీంతో..సీఎం ఎవరి మాటకు ప్రాధాన్యత ఇస్తారు..ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications