Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల మహా పాద‌యాత్ర‌తో జగన్ కు భయం.. అందుకే అణచివెయ్యటం కోసం కుట్ర: లాఠీ చార్జ్ పై చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తుళ్లూరు నుండి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్న రైతులకు ప్రజల నుండి విశేషంగా మద్దతు లభిస్తోంది. పాదయాత్ర చేస్తున్న రైతులకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ మద్దతు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వారి వద్దకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక టీడీపీ పాదయాత్ర చేస్తున్న రైతులకు అడుగడుగునా మద్దతు ప్రకటిస్తుంది .

లాఠీ చార్జ్ చేసిన పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

లాఠీ చార్జ్ చేసిన పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో రైతుల మహా పాదయాత్ర పదకొండవ రోజు కొనసాగుతోంది. 11వ రోజు రైతుల మహాపాదయాత్ర నాగులుప్పాడు నుండి ప్రారంభం కాగా చదలవాడ వద్దకు చేరుకునే సరికి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైతులను కలవడం కోసం స్థానికులు వచ్చిన క్రమంలో అడ్డుకున్న పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆపై ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో నాగార్జున అనే రైతు చెయ్యి విరిగింది. పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

 మహా పాదయాత్రకు వస్తున్న స్పందన చూసే జగన్ కు భయం

మహా పాదయాత్రకు వస్తున్న స్పందన చూసే జగన్ కు భయం

రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న వారిపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించారు టిడిపి అధినేత చంద్రబాబు .పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి అణచి వేయడం కోసం కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు . అమరావతి రైతుల మహా పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి జగన్ కు భయం పట్టుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని పేర్కొన్న చంద్రబాబు 13 జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతి నిలిపివేసి మూడు రాజధానులు పేరిట విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే కక్ష కట్టి ఆపేందుకు కుట్రలు

కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే కక్ష కట్టి ఆపేందుకు కుట్రలు

ప్రజారాజధాని అమ‌రావ‌తి కోసం కోర్టు అనుమతితో రైతులు పాదయాత్ర చేస్తుంటే, కక్షగట్టి ఆపడానికి ప్ర‌భుత్వం స‌వాల‌క్ష‌కారణాలు వెదుక్కుంటోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతుల‌పాద‌యాత్ర అంటే ఎందుకంత భయం? అంటూ ప్రశ్నించారు. ఉద్య‌మంలా ఆరంభ‌మై ఉధృత‌మైన పాద‌యాత్ర‌ని అడుగ‌డుగునా అడ్డుకునేందుకు స‌ర్కారు వేయ‌ని ఎత్తుగ‌డ లేదు, పోలీసులు చేయ‌ని కుట్ర‌లేదు అంటూ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన రైతుల‌పై పోలీసుల లాఠీచార్జ్ అరాచ‌కానికి ప‌రాకాష్ట‌ అని మండిపడ్డారు.

 పాదయాత్ర కవర్ చేస్తున్న మీడియాపైనా పోలీసుల ఆంక్షలు

పాదయాత్ర కవర్ చేస్తున్న మీడియాపైనా పోలీసుల ఆంక్షలు

ఎండను, వానను లెక్కచేయకుండా మ‌హాపాదయాత్రను క‌వ‌ర్ చేస్తున్న‌ మీడియా ప్రతినిధులపై పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. మ‌హాపాద‌యాత్ర‌కి వెల్లువెత్తుతున్న ప్ర‌జామ‌ద్ద‌తుని మీడియా బ‌య‌టి ప్ర‌పంచానికి చూపిస్తోంద‌నే అక్క‌సుతో మీడియాపై పోలీసులు ఆంక్ష‌లు విధించ‌డం దారుణం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు దిగ్బంధించి పాదయాత్రకు ఆటంకం కలిగించటం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకోవటం మానుకోవాలని హితవు పలికారు. లాఠీ చార్జ్ లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై జగన్ కక్ష సాధింపులకు ఇది నిదర్శనం అన్నారు చంద్రబాబు నాయుడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+