అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండలిలో బిల్లుల రద్దుపై ఉత్కంఠ - హైకోర్టు అంగీకరిస్తుందా ? ఆ తర్వాతే కొత్త బిల్లు కార్యాచరణ

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని రద్దు చేస్తూ నిన్న ఏపీ శాసనసభ నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన ఈ బిల్లులు సహజంగానే రద్దయిపోయాయి. అయితే హైకోర్టుకు ఈ వివరాల్ని ప్రభుత్వం అందించేందుకు సమయం దొరకలేదు. దీంతో వచ్చే శుక్రవారం కల్లా ఈ వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు కోరింది. వీటిని పరిశీలించి సోమవారం తిరిగి విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. దీంతో ఇప్పుడు హైకోర్టు వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ మొదలైంది.

 రాజధానుల బిల్లుల రద్దుపై హైకోర్టు

రాజధానుల బిల్లుల రద్దుపై హైకోర్టు


ఏపీలో మూడు రాజధానుల బిల్లుల రద్దు కోసం ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించేసుకుంది. అంతకు ముందే హైకోర్టుకు ఇలా బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పేసింది. అయితే బిల్లులు రద్దయ్యాక వాటి వివరాలు తమకు ఇవ్వాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆ వివరాలు ఇస్తామని ఆయన హైకోర్టుకు తెలిపారు. కానీ ఇప్పటికే శాసనసభలో బిల్లుల రద్దు పూర్తి కాకపోవడంతో ఈ వివరాలు ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో వివరాల సమర్పణకు శుక్రవారం వరకూ గడువిచ్చింది.

మండలిలో బిల్లులు రద్దు చేయాలా వద్దా

మండలిలో బిల్లులు రద్దు చేయాలా వద్దా

రాజధాని కోసం తీసుకొచ్చిన రెండు బిల్లుల్ని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించేసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ వాటికి ఆమోదం కూడా తెలిపింది. ఇప్పుడు అసెంబ్లీ తర్వాత మండలిలోనూ వాటిని రద్దు చేయాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకంటే గతంలో మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది లేదు. కానీ అమోదం పొందినట్లే భావంచాలని గవర్నర్ ను కోరడం, ఆయన ఆమోద ముద్ర వేసేయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు మండలిలో తిరిగి వాటిని ప్రవేశపెట్టడంపై చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం వీటిని మండలిలోనూ ప్రవేశపెట్టి రద్దు చేస్తే ఓ సమస్య, చేయకపోతే ఓ సమస్య అన్నట్లు చిక్కుల్లో పడుతోంది.

మండలిలో రద్దు చేయకపోతే

మండలిలో రద్దు చేయకపోతే

గతంలో శాసనసభ, శాసనమండలి ఆమోదం పేరుతోనే గవర్నర్ వద్ద ఈ బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయించుకుంది. ఇప్పుడు అసెంబ్లీలో రద్దు చేసి మండలిలో రద్దు చేయకుండా ఈ బిల్లులు రద్దయినట్లేనని హైకోర్టుకు చెప్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. గతంలో మండలి ఆమోదించని బిల్లుల్ని ఆమోదం పొందినట్లు ఎలా భావించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది. ఇప్పుడు మరోసారి మండలిలో రద్దు కాకుండా ఈ బిల్లులు రద్దయినట్లు ఎలా అనుకోవాలంటూ ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇరుకున పడటం ఖాయం. దీంతో ప్రభుత్వం ఈ సమావేశాల్లో మండలిలో బిల్లులు రద్దు చేసే ప్రక్రియ చేపట్టక తప్పదనే వాదన వినిపిస్తోంది.

కొత్త బిల్లు వివరాలు కోరిన హైకోర్టు

కొత్త బిల్లు వివరాలు కోరిన హైకోర్టు

వైసీపీ సర్కార్ రాజధాని కోసం తీసుకొచ్చిన రెండు బిల్లుల్ని అసెంబ్లీలో రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపింది. అదే సమయంలో ఈ బిల్లుల స్ధానంలో మరో బిల్లును తీసుకొస్తామని కూడా హైకోర్టుకు తెలిపింది. దీంతో ఇప్పుడు ఈ రద్దయిన బిల్లుల్ని ఆమోదించడంతో పాటు మరో కొత్త బిల్లు తీసుకొస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను కూడా హైకోర్టు ఆమోదించాల్సి ఉంటుంది. అలా అయితేనే ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రాజధాని పిటిషన్లపై విచారణ ఆపేందుకు వీలవుతుంది. అలా కాకుండా బిల్లుల రద్దు పూర్తీకాలేదనో, అలా కాకుండానే కొత్త బిల్లు తీసుకొస్తున్నారనో కోర్టు భావిస్తే తిరిగి సమస్య మొదటికి రావడం ఖాయం.

సోమవారం తేలిపోతుందా ?

సోమవారం తేలిపోతుందా ?

ప్రస్తుతం ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిన దాని ప్రకారం ఈ శుక్రవారం కల్లా రాజధాని బిల్లుల రద్దు వివరాల్ని హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. అంటే అసెంబ్లీతో పాటు మండలిలోనూ ఈ బిల్లుల్ని రద్దు చేయడం, లేక అసెంబ్లీలో మాత్రమే ఆమోదించారన్న కారణంతో వాటిని రద్దయినట్లుగానే పరిగణించాలని హైకోర్టును కోరడం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బిల్లుల రద్దుపై హైకోర్టు సంతృప్తి చెందితేనే కొత్త బిల్లు తయారీకి తమ ఆమోదం తెలుపుతుంది లేకుండా బిల్లులు రద్దు కాలేదని తేల్చి చెప్పడం ఖాయం. సోమనారం విచారణలో హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే ప్రభుత్వం కొత్త బిల్లుపై కసరత్తు ప్రారంభించే అవకాశముంది.

English summary
andhrapradesh high court's decision on acceptence of three capital bills repealment is crucial for jagan govt's further plans on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X