Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి తాజా డెడ్ లైన్ ఇదే..
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా.. కేంద్రం నుంచి సాయం అందక ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రంపై ఒత్తిడి పెంచిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు తాజాగా ప్రాజెక్ట్ పూర్తి కోసం కొత్త డెడ్ లైన్ ప్రకటించింది. ఈ గడువు లోపు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇవాళ వెల్లడించింది.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2025 జూన్ ను తాజా గడువుగా నిర్ణయించినట్లు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ నారాయణరెడ్డి ఇవాళ వెల్లడించారు. అయితే ఏడాది ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోలవరం ప్రాజెక్టు సమీక్షలో పాల్గొన్న ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసంతో పాటు ఇతర అన్ని అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ఇవాళ జరిగిన సమీక్షలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.17414 కోట్ల తాత్కాలిక సాయం చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే కేంద్రం మాత్రం దీనిపై నిర్దిష్ట హామీ అయితే ఇవ్వలేదు. కేవలం పరిశీలిస్తామని మాత్రం చెప్పింది. 41.15 మీటర్ల ఎత్తువరకూ ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాల కోసం చెల్లించేందుకు నిధులు అడిగితే మాత్రం సానుకూలంగా స్పందించినట్లు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ వెల్లడించారు.
ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రం తన నిధులతో పూర్తి చేయాల్సి ఉంది. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమే దీన్ని పూర్తి చేస్తుందంటూ కేంద్రాన్ని అడగడం, కేటాయించడం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత కేంద్రం నిధులు ఇస్తేనే ప్రాజెక్టు ముందుకెళుతోంది. వైసీపీ సర్కార్ హయాంలో నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది.
-
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications