వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Pensions Hike : ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్- జనవరి నుంచి రూ.2500-

|
Google Oneindia TeluguNews

ఏపీలో పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పెన్షన్ మొత్తాల పెంపుకు సీఎం జగన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఒకసారి మాత్రమే పింఛన్ మొత్తం పెంచారు. ప్రతీ ఏడాదీ పెంచుతామని గతంలో హామీ ఇచ్చినా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కారణంగా ఇది సాధ్యం కాలేదు. దీంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు రూ.2500కు పెన్షన్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.

 పెన్షనర్లకు జగన్ గుడ్ న్యూస్

పెన్షనర్లకు జగన్ గుడ్ న్యూస్

ఏపీలో వైఎస్సార్ ఆసరా పేరుతో ఇస్తున్న సామాజిక పింఛన్లను పెంచాలని ప్రభుత్వ నిర్ణయించింది.ఇప్పటివరకూ పేదలకు రూ.2250 చొప్పున ఈ పింఛన్లు ఇస్తుండగా.. వచ్చే ఏడాది నుంచి రూ.2500 చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఈ మేరకు తన నిర్ణయం వారికి వెల్లడించారు. దీంతో రూ.250 చొప్పున పింఛన్ పెరగబోతోంది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు పింఛన్ల పంపిణీ మొత్తాన్ని పెంచడం ద్వారా వాటిపై తమ ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది.

జనవరి నుంచి అమలు

జనవరి నుంచి అమలు


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లను ఓసారి మాత్రమే పెంచారు. దీంతో గతంలో రూ.2 వేలుగా ఉన్న పెన్షన్ మొత్తం కాస్తా రూ.2250కు చేరింది. ఇప్పుడు మరోసారి పెంచితే అది కాస్తా రూ.2500కు చేరనుంది. దీంతో పేదలకు ఆ మేరకు మేలు కలగడంతో పాటు ప్రభుత్వంపైనా ఆర్ధిక భారం పెరగనుంది. అయినా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుకు మొగ్గు చూపింది. పెరిగిన పింఛన్లను వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

పెన్షన్లపై సర్కార్ ప్లాన్

పెన్షన్లపై సర్కార్ ప్లాన్

గతంలో వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 వేలకు పెంచిన పింఛన్ ను తాము అధికారంలోకి వస్తే రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ అధికారంలోకి రాగానే రూ.3 వేలకు పింఛన్ పెరుగుతుందని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లలో మీ పింఛన్ రూ.3 వేలకు చేరుతుందని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఆ లెక్కన చూసినా ఇప్పటికే రెండు విడతల్లో రూ.250 చొప్పున రూ,500 పెరగాల్సి ఉంది. కానీ రూ.250 మాత్రమే పెరిగింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం పెంపుకు మొగ్గు చూపింది.

విపక్షాల విమర్శలతో

విపక్షాల విమర్శలతో


ఏపీలో వైసీపీ సర్కార్ గతంలో ఇచ్చిన పింఛన్ల హామీ ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని విపక్షాలు నిత్యం ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో అనర్హులకు ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తోంది. దీంతో క్షేత్రస్ధాయిలో పింఛన్ దారుల్లో అసంతృప్తి పెరుగుతోందనే నివేదికలు వస్తున్నాయి,. దీంతో ప్రభుత్వం పింఛన్ పెంపుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా పెంచకపోతే వచ్చే రెండేళ్లలో ఆర్ధిక భారం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం వెంటనే పెంచడం ద్వారా లబ్దిదారుల్లో అసంతృప్తిని కొంతమేరకైనా తగ్గించాలని యోచిస్తున్నట్లు అర్ధమవుతోంది.

English summary
andhrapradesh government on today decided to enhance social pensions amount to rs.2500 from january next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X