ఏపీలో మద్య నిషేధం లేనట్లే-షాపుల తగ్గింపుకు బ్రేక్-ఆదాయంపై ఫోకస్-అప్పులకూ అదే గతి
ఏపీలో మద్య నిషేధం ఉన్నట్లా ? లేనట్లా ? ఉండీ ఉండనట్లా ? .. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల్ని బట్టి చూస్తుంటే జగన్ సర్కార్ మద్య నిషేధాన్ని పూర్తిగా అటకెక్కించేసినట్లే కనిపిస్తోంది. గతంలో అక్కచెల్లెళ్ల కోసమంటూ దశల వారీ మద్యనిషేధం కోసం ప్రయత్నించిన సీఎం జగన్..ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. గతంలో షాపుల్ని తగ్గించి, వాటిలోనూ నాసిరకం మద్యాన్ని అమ్ముతూ మద్య నిషేధంఅమలు చేస్తున్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో అసలు మద్యాన్ని బయటకు తీస్తోంది.

వైసీపీ మద్యనిషేధం హామీ
ఏపీలో వైసీపీ సర్కార్ అదికారంలోకి వచ్చేందుకు దోహదపడిన హామీల్లో మద్య నిషేధం కూడా ఒకటి. రాష్ట్రంలో అక్కచెల్లెళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని గతంలో వైసీపీ అధినేతగా పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలవుతుందని అంతా భావించారు. తొలి ఏడాదిలో భారీగా షాపుల్ని తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం వాటిని యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో వైసీపీ ఎన్నికల హామీపై ప్రశ్నలు మొదలయ్యాయి.

తగ్గని మద్యం షాపులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత టీడీపీ ప్రభుత్వంలో వేలం పాటల ద్వారా ప్రైవేటు వ్యక్తులు పాడుకున్న షాపులు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా మటుకు టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో వీరికి అడ్డుకట్ట వేసేందుకు మద్యం షాపుల్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అంతే కాదు వాటిని కూడా దశలవారీగా తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్నట్లుగానే తొలి ఏడాది 20 శాతం మేర షాపుల్ని ప్రభుత్వం తొలగించింతది. దీంతో ఏపీలో మద్య నిషేధం అమలు ప్రారంభమైందని అంతా సంబర పడ్డారు. కానీ ఆ సంతోషం వారికి ఎక్కువకాలం నిలవలేదు.

మందుబాబులకు షాకులే షాకులు
ఏపీలో గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దేశవ్యాప్తంగా ఏయే మద్యం బ్రాండ్లు దొరుకుతున్నాయో సరిగ్గా అవే బ్రాండ్లు ఏపీలోనూ దొరికేవి. రేట్ల విషయంలోనూ పెద్దగా తేడా ఉండేది కాదు. కానీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. పాత బ్రాండ్లు కనిపించడం మానేశాయి. వాటి స్ధానంలో కొత్త కొత్త బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరుగని బ్రాండ్లు. అంతే కాదు వీటి ధరలు కూడా మోతమోగడం మొదలైంది. అదేమని అడిగితే ప్రభుత్వం మద్యం అమ్మకాల్ని నిరుత్సాహ పరిచే ఉద్దేశంతోనే వీటిని అమ్ముతున్నట్లు చెప్పుకోవడం మొదలుపెట్టింది. అసలే తమకు అలవాటైన మందు దొరక్క, దొరికిన నాసిరకం మందును సైతం ఎక్కువ ధరలకు అమ్ముతుండటంతో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. తాగింది కిక్కు ఎక్కక జేబులు కూడా ఖాళీ అవుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు లబోదిబోమనడం మొదలుపెట్టారు.

సంక్షేమం డబ్బు మద్యంలో వసూలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదలకు భారీ ఎత్తున డబ్బులు ఇస్తోంది. ప్రతీ ఇంటీకి కనీసం ఎంత లేదన్నా ఏడాదికి రూ.50వేలు ఇస్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో పాటే ఇలా ఇస్తున్న డబ్పుల్ని తిరిగి వారి నుంచి వసూలు చేసేస్తోంది. వివిధ పథకాల ద్వారా లక్షలాది రూపాయలు పేదలకు ఇస్తున్నట్లు పైకి చెబుతున్న ప్రభుత్వం మద్యం అమ్మకాల రూపంలో వారి నుంచి తిరిగి ముక్కుపిండి వసూలు చేస్తోంది. అందుకే మద్య నిషేధాన్ని అమలు చేయడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మద్యం అమ్మకాల్ని నిరుత్సాహపరుస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం కాస్తా కాసుల కక్కుర్తితో తాము సంక్షేమం రూపంలో ఇస్తున్న డబ్బును తిరిగి వసూలు చేసేయడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం వీటిని లెక్కచేసే పరిస్ధితుల్లో లేదు.

మద్యం ఆదాయం అప్పులకు తాకట్టు
నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు అమ్ముతూ మద్య నిషేధాన్ని సైతం నీరుగారుస్తున్న ప్రభుత్వం.. ఆదాయం పెంచుకునే మార్గాలపైనే ప్రస్తుతం దృష్టిసారించింది. ఇందులో భాగంగా మద్యంపై వస్తున్న ప్రస్తుత ఆదాయంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఏపీఎస్డీసీ ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వచ్చే 20 ఏళ్ల ఆదాయం తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. ఇఫ్పుడు నేరుగా బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా కూడా మరో భారీ అప్పు తెచ్చుకునేందుకు కూడా ఇదే ఆదాయాన్ని వాడుకుంటోంది. దీంతో భవిష్యత్తులో మద్య నిషేధం ఉంటుందన్న ఆశలు కూడా ఆవిరవుతున్నాయి.

ఏపీలో మద్య నిషేధం లేనట్లే ?
ఓవైపు మద్యం షాపుల సంఖ్యను తగ్గించకపోవం, మరోవైపు నాసిరకంలోనూ రోజుకో కొత్త బ్రాండ్ దింపుతుండటం, ఇంకోవైపు మద్యం ద్వారా వచ్చే ఆదాయాల్ని అప్పుల కోసం తాకట్టు పెడుతుండటం.. ఇలా ఎటు చూసినా మద్య నిషేధానికి తూట్లు పొడిచే చర్యలు వేగంగా సాగిపోతున్నాయి. దీంతో వైసీపీ గతంలో ఇచ్చిన మద్యనిషేధం హామీ అటకెక్కినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పట్లో ఎవరూ మాట్లాడేందుకు సైతం సాహసించని పరిస్దితి. ఆదాయం కావాలో మద్యనిషేధం కావాలో తెల్చుకోవాలని సీఎం జగన్ అధికారులకు చెప్పేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మద్యనిషేధం హామీని వైసీపీ తుంగలో తొక్కినట్లేనన్న వాదన వినిపిస్తోంది. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్ధితుల్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా లేకపోవడమే ఇందుకు అసలు కారణంగా కనిపిస్తోంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications