జగన్ సర్కార్ మరో యూటర్న్-హైకోర్టు అక్షింతలతో జీవో వెనక్కి-ఆ కథ మొదటికి
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బలు తప్పలేదు. నిబంధనల్ని, చట్టాల్ని పట్టించుకోకుండా తీసుకుంటున్న చాలా నిర్ణయాలు న్యాయపరీక్షలో నిలబడటం లేదు. తాజాగా మరో నిర్ణయ కూడా ఇదే కోవలోకి చేరిపోయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తప్పుబట్టింది. దీంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు చెప్పేసింది.

హైకోర్టులో ఎదురుదెబ్బలు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం చెప్పినట్లు వింటూ ఇస్తున్న ఆదేశాలు న్యాయపరీక్షలో తేలిపోతున్నాయి. దీంతో హైకోర్టులో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. తప్పని తెలిసినా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించకూడదని ఆ ఆదేశాలు ఇస్తున్న అధికారులతో పాటు చివరికి ప్రభుత్వ పెద్దలు కూడా హైకోర్టులో దోషులుగా నిలబడుతున్న పరిస్దితులు తలెత్తుతున్నాయి.

తాజాగా మరో షాక్
ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘను పాల్పడిందని, చట్టాల ప్రకారం వ్యవహరించలేదని పిటి్షనర్లు ఆరోపించారు. వీటిని పరిశీంచిన హైకోర్టు.. ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో ఆ వివాదాస్పద ఆదేశాలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు చెప్పేసింది. దీంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారంలో భారీ షాక్ తగిలినట్లయింది.

మహిళా పోలీసులుగా గ్రామ కార్యదర్శులపై
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శుల్ని మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. వీరిని కొన్ని నెలల క్రితం ప్రభుత్వం మహిళా పోలీసులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం వారిని మహిళా పోలీసులుగా అనధికారికంగా పిలుస్తుండటమే. మహిళలపై రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న తరుణంలో గ్రామ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అప్పట్లో సమర్ధించుకుంది. కానీ దీన్ని హైకోర్టు తప్పుబట్టింది.

జగన్ సర్కార్ యూటర్న్
గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59పై హైకోర్టులో విచారణ సందర్భంగా పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకుంది. ఇవాళ జీవో నెం.59పై హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు తెలిపింది. పిటీషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నర్రా శ్రీనివాస్... గ్రామ కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీసు డ్రస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు కూడా దీన్ని ఆక్షేపించింది. చివరికి జీఓను వెనక్కి తీసుకుని వారి సేవలను ఎలా వాడుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications