జగన్ సర్కార్ హుకుం: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు యధాతధం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబరు 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబుతో చర్చలు జరిపిన నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ఆ చర్చలు ఫలించక పోయినా సేవలు నిలిపివేయబోమని స్పష్టం చేశారు.

డిసెంబర్ 29వ తేదీ నుండి నుండి ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించిన క్రమంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చిన నోటీసులపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తో చర్చలు జరిపింది. ఈ చర్చల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆర్ధికశాఖ అధికారులతో మంగళగిరిలో సమావేశం నిర్వహింఛి బకాయిల విడుదలపై ఏం చేద్దామని చర్చించారు.

Jagan govt order to network hospitals: Arogyasri services in AP will continues!!

నిన్న నిర్వహించిన సమావేశానికి ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరయ్యారు . మూడు గంటల పాటు చర్చలు జరిపిన క్రమంలో నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఒక అడుగు వెనక్కు వెయ్యాల్సి వచ్చింది. జగన్ సర్కార్ హుకుంతో వెనక్కు తగ్గింది. ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరనప్పటికి ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము చెప్పింది చేయాల్సిందేనని నెట్వర్క్ ఆసుపత్రుల వారికి నిన్నటి చర్చల్లో ఆరోగ్య శాఖా ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. నెట్ వర్క్ ఆసుపత్రుల డిమాండ్లపై స్పందించిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్యాకేజీ పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ఇప్పుడున్న ప్రొసీజర్ లలో 50 లేదా 100 ప్రొసీజర్ ల ప్యాకేజీలు పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆ లిస్ట్ కూడా నెట్వర్క్ ఆసుపత్రులే ఇవ్వాలని తెలిపారు .ఇప్పటికే 500 కోట్లు ఇచ్చామని మరో 5 వందల కోట్ల రూపాయలు 15 రోజుల్లో క్లియర్ చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+