విధులకు హాజరుకాకుంటే జరిగేదిదే: అంగన్వాడీలకు జగన్ సర్కార్ హుకుం!!

గత 22 రోజులుగా తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించక పోగా, జగన్ సర్కార్ వారికి ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె పేరుతో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

ఈనెల 5వ తేదీలోపు విధులకు హాజరు కావాలని, విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు విధులకు హాజరు కాని అంగన్వాడీల వివరాలు సేకరించాలని, సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేసే ప్లాన్ లో ఉంది. ప్రభుత్వం తమకు అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడి కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Jagan govt shock to anganwadis; issued orders on the duties of anganwadis!!

గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ, ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి ప్రకటన చేస్తుందని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనతో బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేసింది.

ఈనెల 5వ తేదీలోగా అందరూ విధులకు హాజరుకావాలని హుకుం జారీ చేసింది. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఒక మారు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు జరిపిన అంగన్వాడీల డిమాండ్ కు ఆయన ససేమిరా అన్నారు. దీంతో మళ్లీ ఆందోళనల బాట పట్టిన అంగన్వాడీలు సీఎం జగన్ తమ విషయంలో కనికరం చూపాలని డిమాండ్ చేశారు.

బుధవారం నుండి ఆందోళనలు ఉధృతం చేస్తామని, కలెక్టరేట్ లను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేసి షాకిచ్చింది. మరి తాజాగా జగన్ సర్కార్ నిర్ణయంతో అంగన్వాడీ లు ఆందోళనలు కొనసాగిస్తారా? లేక విధులకు హాజరవుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+