వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నట్టేట ముంచావ్: జగన్‌పై హరీష్, మెజార్టీ ఉంది: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Jagan have no moral right: Harish
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు సోమవారం నిప్పులు చెరిగారు. తెలంగాణకు మద్దతు పలకని జగన్‌కు తమ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు. కొద్ది రోజులైతే జగన్‌నే ఓదార్చాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. నమ్ముకున్న నేతలనే నట్టేట ముంచిన జగన్ ఈ ప్రాంతంలో ఓదార్పు యాత్ర ఎలా చేపడతారని ప్రశ్నించారు.

జగన్ ఓదార్చాలనుకుంటే ముందు కొండా సురేఖ, జిట్టా బాలకృష్ణా రెడ్డిలాంటి వారిని ఓదార్చాలన్నారు. తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హరీష్ రావు అన్నారు. ఉద్యమానికి ఏం చేశారని వారు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతించలేని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం ఎందుకన్నారు.

మెజార్టీ ఉంది: బొత్స

తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజార్టీ ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ న్యూఢిల్లీలో అన్నారు. రేపు ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో తమ పార్టీ నేతలు భేటీ అవుతారని చెప్పారు. ఎన్నికలు వాయిదా వేయాలని పార్టీలు కోరుకంటున్నాయన్నారు. తెరాస విలీనం సంగతి అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఎంపీలు అందరూ ఢిల్లీకి రావాలన్నారు.

16 స్థానాలు గెలుస్తాం: రాంరెడ్డి

తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ పదహారు స్థానాల్లో గెలుస్తుందని తమ పార్టీ అధినేత్రికి చెప్పానని రాంరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. తెలంగాణ నుండి సోనియా లేదా రాహుల్ పోటీ చేయాలన్నారు. తాను ఇదే విషయాన్ని చెప్పానన్నారు. విజయోత్సవ సభలకు రాహుల్, సోనియాలను ఆహ్వానించామని చెప్పారు.

English summary
Telangana Rastra Samithi Siddipet MLA Harish Rao on Monday said YSR Congress Party chief YS Jaganmohan Reddy have no right to tour in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X