జగన్, కేసీఆర్ తోడు దొంగలు-హైదరాబాద్ ఆస్తుల కోసమే డ్రామా- జనం పిచ్చోళ్లా- టీడీపీ ఎంపీ
ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదురుతోంది. తెలంగాణ కేబినెట్ భేటీలో ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ పై కేసీఆర్ విమర్శలతో మొదలైన జలయుద్దం ఇప్పుడు ఇరురాష్ట్రాల మంత్రుల విమర్శలు, ప్రతివిమర్శలు, కేంద్రం వద్ద ఫిర్యాదులు, డ్యామ్ లకు భద్రత కల్పించే వరకూ చేరుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు, తాజాగా కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని జగన్ తో పాటు కేసీఆర్ వ్యవహారశైలినీ తప్పుబట్టారు. కీసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు జల వివాదాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కేశీనేని మండిపడ్డారు. అసలు జలవివాదమే ఓ పెద్ద డ్రామా అని కేశినేని పేర్కొన్నారు. కేసీఆర్, జగన్ మధ్య పరస్పర సహకారం ఉందన్నారు.

తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లు నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైనా కేశినేని స్పందించారు. హైదరాబాద్ లో ఉన్న జగన్ ఆస్తులు కాపాడుకోవడం కోసమే మౌనంగా ఉండిపోతున్నారని నాని ఆరోపించారు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి ఇద్దరు సీఎంలూ ఆడుకుంటున్నారని, ప్రజలు ఈ డ్రామాల్ని గమనించలేనంత పిచ్చోళ్లు కాదని నాని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఏఫీ ప్రజల కోసమే కేసీఆర్ తో కొట్లాడటం లేదని నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications