వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఏపీ అభివృద్ధికి జగనే అడ్డు’: దేవినేనితో విస్తుపోయిన ఢిల్లీ మీడియా!

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరు చూసి ఢిల్లీ మీడియా విస్తుపోయింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరు చూసి ఢిల్లీ మీడియా విస్తుపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏపీ అభివృద్ధిని అడ్డుకోడానికి కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

దేశంలో ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద చేపడుతున్న ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మేథోమథనంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. పంజాబ్, యూపీ, హరియాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జగనే లక్ష్యంగా..

జగనే లక్ష్యంగా..

ఆ భేటీ అనంతరం మంత్రి ఉమా ఏపీ భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రితో సమావేశం వివరాలను వెల్లడిస్తారని ఎదురుచూసిన మీడియా యావత్తూ.. ఆయన ఏకబిగిన 33 నిమిషాల పాటు మాట్లాడింది విని విస్తుపోయింది.
ఆయన మీడిమా సమావేశంలో ఎక్కువగా ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడానికే కేటాయించారు.

మీడియా కోరితే..

మీడియా కోరితే..

రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి జగన్‌ అని, గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్క సలహా కూడా ఇవ్వలేదు అంటూ విమర్శించారు. అసలు విషయం చెప్పకుండానే సమావేశాన్ని ముగించి బయలుదేరారు. దీంతో అసలు ఢిల్లీ వచ్చిందెందుకో చెప్పాలంటూ మంత్రిని మీడియా ప్రతినిధులు కోరారు.
అప్పుడు మళ్లీ కుర్చీలో కూర్చున్న దేవినేని.. జలమంథన్‌-4 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానని తెలిపారు.

చంద్రబాబు అహర్శిశలు..

చంద్రబాబు అహర్శిశలు..

ఈ సమావేశంలో పీఎంకేఎస్‌వై, నాబార్డు కింద చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై, నదులు అనుసంధానంపై చర్చించినట్టు చెప్పారు. రైతులు, ప్రజల భాగస్వామ్యంతో ఆగస్టునుంచి నెల రోజులపాటు జలహారతిని మహాయజ్ఞంలా నిర్వహిస్తామని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భజల వనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

విన్నపాలు, వివరాలు..

విన్నపాలు, వివరాలు..

రాష్ట్రంలోని ప్రాజెక్టులకు రావాల్సిన పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విన్నవించినట్లు మంత్రి దేవినేని తెలిపారు. రాష్ట్ర సమస్యలు, నాబార్డు నిధులు, పోలవరం సాయం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కృష్ణా జలాలు రాకుండా ఎగువ రాష్ట్రాల చర్యలను వివరించామన్నారు. మెట్ట, బీడు భూములను సాగులోకి తేవడానికి రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

English summary
YSR Congress Party president Y.S. Jagan Mohan Reddy has become a major obstacle to development in Andhra Pradesh, Minister for Water Resources Devineni Umamaheswara Rao alleged at a media conference in New Dehi on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X