వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మార్క్ సంక్షేమం: 10రోజుల్లో బియ్యం, పింఛన్ కార్డులు, 20రోజుల్లో ఆరోగ్య శ్రీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో సంక్షేమపథకాల అమలులో సీఎం జగన్మోహన్ రెడ్డి తనమార్కు చూపిస్తున్నారు. ప్రభుత్వ సేవలన్నీ నిరుపేద ప్రజలకు నిర్దిష్ట కాలపరిమితిలోనే అందాలని, ఒకవేళ అలా జరగకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు,పింఛన్ కార్డులను అందించాలని సీఎం జగన్ వెల్లడించారు. ఇక అంతే కాదు ఈరోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు,అధికారుల దేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్న జగన్

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్న జగన్

మంగళవారం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ సంక్షేమ పథకాల విషయంలో పలు సూచనలు చేశారు.శాచ్యురేషన్ పద్ధతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలను అందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి లేని వ్యవస్థను తీసుకురావడం కోసం,పాలన ఎక్కడికక్కడ సులభంగా జరగటం కోసం ప్రభుత్వ అహర్నిశలు శ్రమిస్తున్నదని చెప్పారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన వెల్లడించారు.

నిర్దిష్ట గడువులోనే సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశం

నిర్దిష్ట గడువులోనే సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశం

ఇక అంతే కాదు సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కీలక భూమిక పోషించి ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇక ప్రతి గ్రామ,వార్డు సచివాలయాలలో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హత వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం వారికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తును గడువులోగా వెరిఫికేషన్ చేయాలని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పారు. ఒకవేళ వారికి అర్హత లేనట్లయితే సంబంధిత వివరాలను కూడా నమోదు చేయాలని పేర్కొన్నారు.

10 రోజుల్లో బియ్యం,పింఛన్ కార్డులు .. 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ , 90 రోజుల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్న జగన్

10 రోజుల్లో బియ్యం,పింఛన్ కార్డులు .. 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ , 90 రోజుల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్న జగన్

లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను కూడా ఇంటికి వెళ్లి ఇచ్చిరావాలి అని సీఎం జగన్ పేర్కొన్నారు. 10 రోజుల్లో బియ్యం,పింఛన్ కార్డులు .. 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ , 90 రోజుల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని పేర్కొన్నారు .వారి వద్ద నుండి బయోమెట్రిక్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని చెప్పారు. నిర్ణీత సమయంలోగా ప్రజలకు సేవలు అందించకపోతే వారికి జరిగిన నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని సీఎం జగన్ తేల్చేశారు.

అర్హుల జాబితా గ్రామ , వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలన్న సీఎం

అర్హుల జాబితా గ్రామ , వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలన్న సీఎం

ఇక ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇళ్ల స్థలాల కోసం ఎవరైనా మిగిలిపోతే వారు ఇప్పుడైనా అప్లికేషన్లు పెట్టుకోవచ్చని, వాటన్నింటినీ పరిశీలించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే వివిధ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాలను ప్రదర్శించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు

ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు

ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను కూడా అక్కడ పొందుపరుస్తారు. ఇప్పటివరకూ ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న 30.3 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులుచెప్పారు. జూన్‌ 12 కల్లా లబ్దిదారుల తుది జాబితాను ప్రదర్శించాలని సీఎం తెలిపారు.

Recommended Video

Nara Lokesh About Electricity Bills Hike In Andhra pradesh | కరెంటు బిల్లు చూస్తే భయమేస్తుంది
 అధికారులకు సంక్షేమ పథకాల విషయంలో యాక్షన్ ప్లాన్ వివరించిన సీఎం

అధికారులకు సంక్షేమ పథకాల విషయంలో యాక్షన్ ప్లాన్ వివరించిన సీఎం

జూన్ 15 కల్లా పాత లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 30 కల్లా కొత్త లబ్ధిదారులకుసంబంధించి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఎంచెప్పారు. ఇల్లు లేని నిరుపేదలు అందరిని సంతృప్తిపరిచే విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి, గృహ నిర్మాణానికి కూడా సహకరిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక అధికారులు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా 'ప్లాన్ బీ' తో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

English summary
CM Jagan has launched a program to provide all the government welfare services to all the eligible in the village and ward ministries with time limit. As part of this, rice and pension cards in 10 days ..arogya Shi in 20 days, plot to poor in 90 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X