వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను చూసుకుంటా, రూ.10 లక్షలిస్తా: జగన్ హామీ, పరిటాల సునీత కౌంటర్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని, చంద్రబాబులా మోసం చేయేనని చెప్పారు.

మా ఆయన మూర్ఖుడు కాదు: పవన్ కళ్యాణ్ గుండుపై పరిటాల సునీతమా ఆయన మూర్ఖుడు కాదు: పవన్ కళ్యాణ్ గుండుపై పరిటాల సునీత

Recommended Video

మీరు సినిమాకు వెళ్తే మీకు విలన్ నచ్చుతాడా, నా లాంటి హీరో నచ్చుతాడా ?

పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థుల ఫీజులను పూర్తిగా రీయింబర్సుమెంట్ చేస్తామని, పేద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేల దాకా ఇస్తామని తెలిపారు. ఆత్మకూరు మండలం వడ్డిపల్లి సమీపాన ఏర్పాటు చేసిన మైనార్టీల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వస్తే రూ.వెయ్యికి పైగా బిల్లు అయ్యే ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామన్నారు.

 హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రుల్లో వైద్యం

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రుల్లో వైద్యం

ఈ పథకం కింద హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలోని ఆసుపత్రుల్లో కూడా వైద్యం పొందే అవకాశాన్ని కల్పిస్తామని జగన్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం నెట్ వర్క్‌ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా యాజమాన్యాలు వెనకంజ వేస్తున్నాయన్నారు. మైనార్టీలకు వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వస్తే కళాశాల ఫీజు మొత్తాన్ని రీయింబర్సుమెంట్స్‍‌గా అందిస్తామన్నారు.

 అందరికీ ఇస్తాం

అందరికీ ఇస్తాం

హాస్టల్ కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని జగన్ చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.10 వేలు పింఛన్‌ ఇస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్‌ రూ.2 వేలు చొప్పున, వయసు 40 ఏళ్లుగా నిర్ణయిస్తామన్నారు. మసీదుల్లో ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజర్లకు రూ.5 వేలు ఇస్తామన్నారు. చర్చిలకు నెలకు రూ.15 వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు.

నేను వస్తే నెల రోజుల్లో రూ.10 లక్షలు ఇస్తా

నేను వస్తే నెల రోజుల్లో రూ.10 లక్షలు ఇస్తా

తన కుమారులు ఏడాది క్రితం వ్యాధితో మృతి చెందారని, మంత్రులు వచ్చి రూ.10 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి దాకా ఆ హామీ నెరవేరలేదని ఓ బాధితుడు జగన్‌తో మొరపెట్టుకున్నారు. దానికి జగన్ మాట్లాడుతూ.. తాను అధికారంలోకి రాగానే నెల రోజుల్లో రూ.10 లక్షలు వచ్చేలా చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారు.

 జగన్ పాదయాత్ర టైంలో పరిటాల సునీత కౌంటర్

జగన్ పాదయాత్ర టైంలో పరిటాల సునీత కౌంటర్

కాగా, జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి సోమవారం ఎంటర్ అయ్యే సమయంలో మంత్రి పరిటాల సునీత ఆయనకు కౌంటర్ ఇచ్చారు. కాగా, జగన్‌కు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా, అందరికీ అభివృద్ధి కనిపిస్తోందని, వైసీపీకి మాత్రం కనిపించడం లేదని మండిపడ్డారు.

English summary
Promising to go a step further than his father in serving the people, Leader of the Opposition and YSRCP president Y.S. Jagan Mohan Reddy on Monday sought the blessings of the people. He was speaking at a public meeting at Madigubba cross in Raptadu mandal where the Muslim population is more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X