ఎలాంటి సిఎం?: జగన్, డబ్బులకి టిక్కెట్ చిరుతోనే: జెసి

శ్రీకాకుళం/అనంతపురం: మీకు ఎలాంటి ముఖ్యమంత్రి కావాలో ప్రశ్నించుకొని నిర్ణయించుకొని ఓటేయండని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం జగన్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభలో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని జగన్ చెప్పారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజాసంక్షేమం కోసం ఎన్నో ప్రజాహిత పథకాలను ప్రవేశపెట్టారని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటినీ నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. అందరి తలరాతలు మార్చే ఎన్నికలు మరో 35 రోజుల్లో రానున్నాయన్నారు. పదిమందికి మేలు చేసి చంద్రబాబు డబ్బా కొట్టుకునే వారని ఎద్దేవా చేశారు.

Jagan questions public in his meeting

మద్యపానం నిషేదిస్తానని నాడు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత చంద్రబాబు ఆ మాటను మర్చిపోయాడన్నారు. బాబు రోజుకో దొంగ హామీ ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. బాబుది ఎన్నికలకు ముందు ఓ మాట.. ఎన్నికల తర్వాత మరో మాట అన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎందుకు పట్టించుకోలేదన్నారు. బాబు భయానక పాలన కళ్లముందు కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.

చిరుతోనే ఆ సంస్కృతి: జెసి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి చిరంజీవి తోనే ప్రారంభమైందని ఆరోపించారు. కాగా, ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు టిక్కెట్లు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+