Gitam : వైజాగ్ గీతం కాలేజ్ లో ఆక్రమణలు స్వాధీనం తెల్లవారు నుంచే భారీ భద్రత మధ్య
ఏపీలోని విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గీతం యూనివర్శిటీలో ఆక్రమణల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ అధికారులు ఉదయం నుంచే యూనివర్శిటీలోకి ప్రవేశించి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఫెన్సింగ్ వేస్తున్నారు. అయితే భారీ భద్రత ఏర్పాటు చేసి అధికారులు చేసిన హంగామాతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
నగరంలోని గీతం యూనివర్శిటీలో ఉన్న మెడికల్ కాలేజ్ లో తెల్లవారుజాము నుంచే అధికారులు భారీగా చేరుకున్నారు. అయితే వారు కూల్చివేతలు ప్రారంభించినట్లు ప్రచారం జరిగింది . నిబంధనల్ని ఉల్లంఘించి ఇక్కడ కట్టడాలు నిర్మించారని, ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. అందుకే అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ కూల్చివేతలు మాత్రం జరగలేదు.
విశాఖ గీతం యూనివర్శిటీలో ఉన్న గీతం మెడికల్ కాలేజీ కూల్చివేతకి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగినా, ఇక్కడ ఆక్రమించి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మీడియా సహా ఎవరినీ లోనికి అనుమతించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. కనీసం సమాచారం లేకుండా, కక్ష పూరీతంగా వ్యవహరిస్తున్నట్లు గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది.

గతంలో ఓసారి గీతం యూనివర్సిటీ ఆక్రమణలు తొలగించారు. సుమారు 45ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో గీతం మెడికల్ కాలేజీ లో ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. గీతం యూనివర్సిటీ లో ఇవాళ జరిగిన పరిణామాలపై ఆర్డీఓ భాస్కర్ రెడ్డి స్పందించారు. సర్వే నంబర్ 37, 38 ప్రభుత్వ భూములని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వ భూమి అని గుర్తించాం కానీ ఫెన్స్కింగ్ వేయలేదన్నారు. ఈరోజు సర్వే నెంబర్ 17 లో 5.72 సెంట్ల స్వాదీనం చేసుకున్నామన్నారు. ఇది మొత్తం 14ఎకరాల భూమి అన్నారు. గతంలో ఫెన్స్సింగ్గ్ లేదని, ఇపుడు ఏర్పాటు చేశామని ఆర్డీవో తెలిపారు. సర్వే నెంబర్ 15, 20లో సుమారు 40ఎకరాల భూమి వివాదం కోర్టులో ఉందన్నారు.












Click it and Unblock the Notifications