విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ ఆదాయంపై జగన్ సర్కార్ కన్ను-రోజువారీ రాబడిలో 25 శాతం తీసుకునేలా-ఆర్ధిక కష్టాలతో

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నవైసీపీ సర్కార్ కార్పోరేషన్ ను మాత్రం కొనసాగిస్తోంది. రవాణా శాఖ ఉద్యోగులు నడుపుతున్న ఈ కార్పోరేషన్ ద్వారా అప్పులు తీసుకునే వీలుండటం, రద్దు చేయాలంటే కేంద్రంఅనుమతి కావాల్సి రావడంతో దాన్ని కొనసాగిస్తోంది. అయితే ఏటా ఆర్టీసీకి బడ్డెట్ లో కేటాయించే నిధులు ఖర్చుపెట్టని ప్రభుత్వం ఇప్పుడు దాని ఆదాయంపై మాత్రం కన్నేసింది. దీంతో ఇప్పటికే కోవిడ్ నష్టాలతో కుదేలైన ఆర్టీసీ బిత్తరబోతోంది.

ఏపీఎస్ఆర్టీసీ కష్టాలు

ఏపీఎస్ఆర్టీసీ కష్టాలు

ఏపీలోని 26 జిల్లాల్లో బస్సులు నడుపుతున్న ఆర్టీసీకి ఆదాయం మాత్రం దారుణంగా ఉంటోంది. ఏపీలో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలు అంతకంతకూ పెరుగుతుండటం, ప్రైవేటు నుంచి ఎదురవుతున్న పోటీతో ఆర్టీసీ నానాటికీ కుదేలవుతోంది. అదే సమయంలో పెరుగుతున్న డీజిల్ రేట్లు,నిర్వహణ ఖర్చులతో పాటు తాజాగా కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు దాదాపు 5 వేల కోట్లకు పైగా నష్టాలు చవిచూడటం ఆర్టీసీని నిండా ముంచేసింది. ఇలాంటి తరుణంలో నష్టాల్ని కాస్తయినా భర్తీ చేసుకునేందుకు డీజిల్ సెస్ పేరుతో తాజాగా రూ.720 కోట్లను ప్రయాణికులపై ఛార్జీల పెంపు రూపంలో రుద్దేసింది. ఇంత దారుణమైన పరిస్ధితుల్లో ఏ ప్రభుత్వమైనా ఇలాంటి కార్పోరేషన్ ను ఆదుకునేందుకు మరిన్ని నిధులిచ్చి ముందుకొస్తుంది కానీ ఏపీలో మాత్రం అలా జరగడం లేదు.

ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ

ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ

ఆర్టీసీ విషయంలో ముందునుంచీ ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమనే చూపుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా వైసీపీ సర్కార్ ఆర్టీసీని ఆదుకునే విషయంలో అదే శైలి కొనసాగిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులుగా ఉన్న ఉద్యోగులు కాస్తా ప్రజారవాణాశాఖకు బదిలీ అయిపోవడంతో ఇక వారి జీతభత్యాల బెంగ తీరిపోయింది. దీంతో వారు కూడా ఆర్టీసీ గురించి ఆలోచించడం మానేశారు. దీంతో అటు ప్రభుత్వం పట్టించుకోక, ఇటు ఉద్యోగులు కూడా పట్టించుకోక ఆర్టీసీ అనాథగా మారుతోంది. కానీ అది సంపాదించిపెడుతున్న ఆదాయంపై మాత్రం అందరి కన్నూ పడుతోంది.

ఆర్టీసీ ఆదాయంపై సర్కార్ కన్ను

ఆర్టీసీ ఆదాయంపై సర్కార్ కన్ను


ఆర్టీసీ నిర్వహణ విషయంలో నిధులిచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ప్రభుత్వం.. అది తీసుకొస్తున్న ఆదాయంపై మాత్రం కన్నేసింది. ఇప్పటికే డీజిల్ సెస్ రూపంలో ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం... వెంటనే దాన్ని లాగేసుకునేందుకు దారులు వెతకడం మొదలుపెట్టేసింది. ఛార్జీల పెంపుతో ఏకంగా రూ.720 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని దొడ్డిదారిలో తమ ఖాతాలో వేసుకునే మార్గాలు వెతుకుతోంది. ఇందుకోసం అధికారుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

నాలుగోవంతు ఆదాయం సర్కార్ కే జమ ?

నాలుగోవంతు ఆదాయం సర్కార్ కే జమ ?

ఇప్పటివరకూ ఆర్టీసీ సంపాదిస్తున్న ఆదాయంతో సంస్ద నిర్వహణ సాగేది. ప్రభుత్వం నుంచి నిధులు అందకున్నా అందులోనే ఎలాగోలా నిర్వహణ సాగించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఓవైపు ఛార్జీలు పెంచి మరోవైపు ఆ నిధుల్ని తమకు ఇచ్చేలా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రతిపాదనలు పెట్టిస్తోంది. దీని ప్రకారం రోజువారీ సంపాదించే ఆదాయంలో 25 శాతం ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్టీసీకి రోజువారీ వచ్చే ఆదాయంలో ఇక మిగిలేది 75 శాతం మాత్రమే. దీంతోనే ఆర్టీసీ బస్సుల నిర్పహణతో పాటు ఇతర ఖర్చులు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారుల కమిటీ చేస్తున్న ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆర్టీసీపై మరో భారీ పిడుగు పడటం ఖాయం.

English summary
ap government is planning to take 25 percent of rtc's daily income to overcome financial troubles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X