ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్-జగన్ ఏ పదవి ఇచ్చారో ఇచ్చారో తెలుసా?
టీడీపీ ప్రభుత్వ హయాంలో గూఢచర్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసిన జగన్ సర్కార్... సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయనకు పోస్టింగ్ కూడా ఇస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయటంతో 2022 మే 19 తేదీన సాధారణ పరిపాలన శాఖకు ఆయన రిపోర్టు చేశారు. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏబీ వెంకటేశ్వరావుకు పోస్టింగ్ ఇవ్వడంతో ఇప్పటివరకూ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి .విజయ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చింది. తన సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ ను కలిశారు.
తనకు ఎప్పటి నుంచి సస్పెండ్ చేశారో అప్పటి నుంచే ఎత్తేస్తూ ఆదేశాలు ఇవ్వాలని, అప్పటి నుంచి జీతభత్యాల బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. అలాగే కొత్తగా పోస్టింగ్ కూడా ఇవ్వాలని కోరారు. కానీ ప్రభుత్వం ఇవాళ్టి వరకూ ఆయన విజ్ఢప్తిపై మౌనంగా ఉంటూ వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications