Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రైవేటు స్కూళ్లలో విద్యాహక్కు చట్టం-పేదలకు 25 శాతం సీట్లు-అమ్మఒడి నుంచే ఫీజులు .. !

ఏపీలో విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు స్కూళ్లలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పూర్తిస్ధాయిలో మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఏపీలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్లలో పాటించాల్సిన నిబంధనలు, 25 శాతం పేదలకు సీట్ల కేటాయింపు, ఫీజుల చెల్లింపు, ప్రవేశాల అమలు వంటి అంశాలపై సమగ్రంగా నిబంధనలు విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా ప్రైవేటు స్కూళ్లు పాటించేలా చర్యలు తీసుకోబోతోంది.

 ఏపీ ప్రైవేటు స్కూళ్లలో విద్యాహక్కు చట్టం

ఏపీ ప్రైవేటు స్కూళ్లలో విద్యాహక్కు చట్టం

ఏపీలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా పనిచేస్తున్న స్కూళ్లలో విద్యా హక్కు చట్టం అమలుకు ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై ఆయా నిబంధనల్ని ప్రైవేటు స్కూళ్లన్నీ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ పేరుతో విద్యాసంస్ధల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యాహక్కు చట్టం అమలుతో పూర్తిస్ధాయిలో వారిని కట్టడి చేయబోతోంది.

 25 శాతం సీట్లు వారికే

25 శాతం సీట్లు వారికే

విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్ధల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ప్రభుత్వంలో అమలవుతున్న ఈ విధానాన్ని ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లకూ వర్తింపచేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లన్నీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి 25 సీట్లను పేదలకు, ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి, దివ్యాంగులకు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ వివరాలు

నోటిఫికేషన్ వివరాలు

విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యాసంస్ధల్లో ప్రవేశాలకు మార్చి 4న నోటిఫికేషన్ ఇస్తారు. మార్చి 6 నుంచి 16 వరకూ ప్రైవేటు స్కూళ్లన్నీ ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకూ విద్యార్ధులు ఆయా స్కూళ్లలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమిస్తారు. ఏప్రిల్ 9 నుంచి 12 వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న డేటా ప్రకారం ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సమాచారాన్ని నిర్ధారించుకుంటారు. ఏప్రిల్ 13న మొదటి విడత స్కూళ్లలో ప్రవేశాల కోసం లాటరీ నిర్వహిస్తారు. వీరి ప్రవేశాలను ఏప్రిల్ 15 నుంచి 21 వరకూ నిర్ధారిస్తారు. 25న రెండో విడత సీట్ల కోసం లాటరీ నిర్వహించి వారి ప్రవేశాలను ఏప్రిల్ 26 నుంచి 30 వరకూ నిర్ధారిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.

అమ్మఒడి నుంచే ఫీజుల వసూల్

అమ్మఒడి నుంచే ఫీజుల వసూల్

అయితే ఫీజుల విషయంలో మాత్రం ప్రభుత్వం మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ 25 శాతం సీట్ల ద్వారా ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్దుల ఫీజుల్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే అమలు చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం అమ్మఒడి కింద ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి, అందులో నుంచే ఈ ఫీజులు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అమ్మఒడి నుంచి ఈ ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వమే ఆ పథకం ద్వారా ఇచ్చే మొత్తంలో కోతపెట్టి మరీ ఫీజుల రూపంలో మినహాయించుకుని ఇస్తుంది. పట్టణ పాఠశాలల్లో 8 వేల ఫీజు నిర్ణయించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రూ.6500, గిరిజన ప్రాంతాల్లో రూ.5100 ఫీజుగా నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+