వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయం పెంపుకే ఏపీ కొత్త జిల్లాలు ? రేపటి నుంచి కొత్త బాదుడు ! జిల్లా కేంద్రాలతో మొదలు !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. సంక్షేమ భారం నానాటికీ పెరిగిపోతుండటం, అదే సమయంలో రాబడి అదే స్దాయిలో పెరగకపోవడంతో అప్పులతో కాలం వెళ్ల దీస్తోంది. అదే సమయంలో అప్పులు కూడా దొరక్కపోవడంతో ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపు సైతం గగనంగా మారుతోంది. దీంతో రాబడి పెంచుకునేందుకు కొత్త వ్యూహాలకు తెరదీస్తున్న సర్కార్.. గతంలో తాము ప్రజలకు ఇచ్చిన కొత్త జిల్లాల హామీని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హడావిడిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

 కొత్త జిల్లాలతో కొత్త బాదుడు

కొత్త జిల్లాలతో కొత్త బాదుడు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా గణనీయంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం తెరవెనుక వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రాబడులు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచుకోకపోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు కూడా అసాధ్యమని భావిస్తున్నప్రభుత్వం... ఇందుకోసం కొత్త దారులు వెతుకుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా అందులో కొత్త పన్నులు విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా సంకేతాలు అందుతున్నాయి.

 రిజిస్ట్రేషన్ ఛార్జీలపెంపుతో మొదలు

రిజిస్ట్రేషన్ ఛార్జీలపెంపుతో మొదలు

కొత్త జిల్లాల్లో మారిన సమీకరణాలతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొత్త జిల్లా కేంద్రాలు, ఓ జిల్లా నుంచి మరో జిల్లాలోకి మారిన భూముల విలువ పెరగబోతోంది. వీటి ఆధారంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అతి త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు రూపంలో ప్రభుత్వం భారీ ఎత్తున ఆదాయం తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముందుగా జిల్లా కేంద్రాల్లో

ముందుగా జిల్లా కేంద్రాల్లో

కొత్త జిల్లాల్లో రిజిస్టేషన్ ఛార్జీల పెంపు కూడా విడతల వారీగా చేయడం ద్వారా ప్రజలపై భారం పడింది కూడా తెలియనట్లుగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు అర్దమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా కేంద్రాల చుట్టూ ఉన్న భూములు, స్ధలాల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచబోతున్నారు. ఈ పెంపు రేపటి నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్దమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లా కేంద్రాల నుంచే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భారం ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు నుంంచి రాష్ట్రవ్యాప్తంగా ?

ఆగస్టు నుంంచి రాష్ట్రవ్యాప్తంగా ?


ముందుగా జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన తర్వాత ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పెంపు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా పెంపు అమలు చేస్తే జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో జిల్లాల మార్పు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు చెప్పుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీంతో ప్రజల్లోనూ కొత్త జిల్లాల కారణంగా పాలన అందుబాటులోకి వస్తోంది కాబట్టి ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటోంది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు ఇంత వేగంగా అమల్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరగాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిపుణుల సూచనల్ని కూడా తోసిరాజని ప్రభుత్వం ఈ ప్రయోగం చేసేసినట్లు తెలుస్తోంది.

English summary
ruling ysrcp government's decision to form new districts in ap is seems to be for increasing revenues in diffent ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X