మళ్లీ తెరపైకి అమరావతి కార్పోరేషన్- 19 పంచాయతీలతోనే-జగన్ తాజా ప్లాన్ వెనుక ?
ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో ఉన్న 19 గ్రామ పంచాయతీల్ని విలీనం చేస్తూ కొత్త రాజధాని నగర మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో పాటు కార్పోరేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తిచేసుకోవడం అమరావతిలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో విమర్శల నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

అమరావతి మున్సిపల్ కార్పోరేషన్
ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మరోసారి వ్యూహాలు సిద్దం చేస్తోంది. తాజాగా ఇందుకోసం పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతి ప్రజల జీవితాలు అగమ్య గోచరంగా మారుతుండగా.. ఇప్పుడు రాజధాని నగర కార్పోరేషన్ పేరుతో ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలు స్ధానికుల్ని కలవరపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

19 గ్రామ పంచాయతీలతో కార్పోరేషన్
అమరావతిలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజధాని నగర మున్సిపల్ కార్పోరేషన్ లో మొత్తం 19 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. ఇందులో తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే 16 పంచాయతీలతో పాటు మంగళగిరి మండల పరిధిలోకి వచ్చే మరో 3 పంచాయతీలు కూడా ఉన్నాయి. అయా పంచాయతీల పరిధిలో రేపటి నుంచి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయా గ్రామాల్లో కార్పోరేషన్ విషయంలో ప్రజలు ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది.

గతంలో వ్యతిరేకతతో వెనక్కి
గతంలో ప్రభుత్వం ఓసారి అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే వీటికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్ధానిక ప్రజలు ఈ ప్రయత్నాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు అమరావతి ప్రాంతంలో తమకు మెజారిటీ ఉందని చూపించుకునేందుకే అక్కడ ఎన్నికలు నిర్వహణ కోసం ఈ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. దీంతో గతంలో ప్రభుత్వం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం తిరిగి ఇప్పుడు మరోసారి కార్పోరేషన్ ను తెరపైకి తెచ్చింది.

హైకోర్టు ఆదేశాలతో మరోసారి
వాస్తవానికి వైసీపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లుల్ని అసెంబ్లీలో తాజాగా వెనక్కి తీసుకుంది. దీంతో ఈ బిల్లుల్లో ఒకటైన సీఆర్డీయే రద్దు బిల్లు కూడా రద్దయింది. దీంతో తిరిగి సీఆర్డీఏ ఉనికిలోకి వచ్చింది. గతంలో మూడు రాజధానుల ప్రక్రియ నేపథ్యంలో సీఆర్డీయే రద్దు కావడంతో అక్కడ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. అలాగని పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. కానీ తాజాగా దీనిపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడంతో రాజధాని బిల్లులు వెనక్కి తీసుకున్నాక అక్కడ ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదనే ప్రశ్న ఎదురైంది. దీంతో త్వరలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

25 గ్రామాల కోసం అమరావతి పట్టు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోకి 25 గ్రామాల్ని తెచ్చింది. ఇందులో తుళ్లూరు మండలంలో 16, మంగళగిరి మండలంలో 7, తాడేపల్లిలో 2 ఉండేవి. వాటి శివారు గ్రామాలతో కలిపి 29 గ్రామాలుండేవి. గతేడాది మార్చిలో వైసీపీ సర్కార్ మంగళగిరిలోని ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి పంచాయతీలను, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలని, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ప్రత్యేక నగర పాలక సంస్ధగా గుర్తిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు తాజా నిర్ణయంతో వీటిలో కొన్ని మినహాయించి మొత్తం 19 గ్రామాలతోనే కార్పోరేషన్ ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో రాజధాని ప్రజలు మాత్రం మొత్తం రాజధాని నగర కార్పోరేషన్ కాబట్టి గతంలో రాజధానిగా గుర్తించిన 25 గ్రామాలతోనే అది ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు.

జగన్ తాజా ప్లాన్ వెనుక ?
అమరావతి
నుంచి
రాజధాని
తరలింపుకు
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకోగానే
అక్కడ
అభివృద్ధి
పనులు
నిలిచిపోయాయి.
వాటిని
తిరిగి
ప్రారంభిస్తామని
ప్రభుత్వం
చెబుతున్నా
ముందడుగు
పడటం
లేదు.
అలాగే
ఎన్నికలు
కూడా
జరగడం
లేదు.
ప్రజా
వ్యతిరేకత
భయంతో
ప్రభుత్వం
అక్కడ
ఎన్నికలకు
జంకుతోంది.
తాజాగా
హైకోర్టు
ఆదేశాలుతో
అక్కడ
ఎన్నికలు
నిర్వహించక
తప్పని
పరిస్ధితి.
దీంతో
అమరావతి
కార్పోరేషన్
లో
తమ
సొంత
లెక్కలు
వేసుకున్నాక
19
గ్రామ
పంచాయతీలతో
కార్పోరేషన్
ఏర్పాటుకు
ప్రభుత్వం
సిద్దమవుతున్నట్లు
తెలుస్తోంది.
అలాగైతే
ప్రజా
వ్యతిరేకత
కొంతైనా
అధిగమించవచ్చని
సర్కార్
భావిస్తున్నట్లు
కనిపిస్తోంది.