కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలిసొచ్చిన ఛాన్స్- న్యాయ రాజధానికే తొలి న్యాయం- హైకోర్టుకు ముందే కర్నూలుకు హక్కుల కమిషన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ జగన్ సర్కార్ ముందడుగు వేయలేకపోయింది. మూడు రాజధానులపై అభ్యంతరాల నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో అమరావతి నుంచి మిగిలిన రెండు రాజధానులకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆంక్షలు విధించింది. కానీ తాజాగా హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు న్యాయ రాజధాని అయిన కర్నూలుకు ఓ ప్రభుత్వ కార్యాలయం తరలి వెళ్లేందుకు మార్గం సుగమం చేశాయి. దీంతో జగన్ సర్కార్ వెంటనే రంగంలోకి దిగి తరలింపుకు ఏర్పాట్లు చేస్తోంది.

మూడు రాజధానులపై డైలమా

మూడు రాజధానులపై డైలమా

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి ముందడుగు వేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం అమరావతి నుంచి రాజధాని తరలింపుపై అభ్యంతరాలే. తొలుత అభ్యంతరాలుగా మొదలైన ఈ వ్యవహారం చివరికి కోర్టులకు పిటిషన్ల రూపంలో చేరడంతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఎప్పుడన్న డైలమా ఇంకా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వైజాగ్, కర్నూలుకు కార్యాలయాలు తరలిస్తామని చెబుతున్నా ఆ దిశగా ముందడుగు వేయలేని పరిస్దితులు నెలకొన్నాయి.

న్యాయ రాజధానికే తొలి ఛాన్స్

న్యాయ రాజధానికే తొలి ఛాన్స్

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని మిగతా రెండు రాజధానులైన కర్నూలు, విశాఖకు తరలించే విషయంలో హైకోర్టు ఆంక్షలున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలపైనా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. దీంతో తాజాగా హైకోర్టు దీనిపై స్పందించింది. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు ఉండిపోతే ఇక్కడి ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీంతో సదరు కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో ముందుగా న్యాయ రాజధాని అయిన కర్నూలుకు తొలి కార్యాలయం తరలి రానుంది.

కర్నూలుకు మానవ హక్కుల కమిషన్

కర్నూలుకు మానవ హక్కుల కమిషన్

ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నుంచి పనిచేసిన ఏపీ మానవ హక్కుల కమిషన్ 2014లో విభజన తర్వాత కూడా అక్కడే ఉండిపోయింది. అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తికాకపోవడం, కొత్తగా హక్కుల కమిషన్ కు కార్యాలయం కేటాయించే పరిస్ధితి లేకపోవడంతో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వాలు దీన్ని హైదరాబాద్ లోనే ఉంచేశాయి. ఇప్పుడు హైకోర్టు వేసిన ప్రశ్నతో ఏపీకి మానవ హక్కుల కమిషన్ తరలింపు వ్యవహారం ముందుకు కదిలింది. దీంతో త్వరలో ఏపీకి మానవ హక్కుల కమిషన్ తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం... ఇందుకు న్యాయరాజధాని కర్నూలును ఎంచుకుంది.

 మూడు రాజధానుల ప్రక్రియలో తొలి అడుగు

మూడు రాజధానుల ప్రక్రియలో తొలి అడుగు

మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఎక్కడికీ తరలించే వీల్లేకుండా పోయింది. హైకోర్టులో కేసుల వ్యవహారం తేలితే కానీ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేపట్టే పరిస్ధితి లేదు. దీంతో వైసీపీ సర్కార్ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులతో హైదరాబాద్ నుంచి హక్కుల కమిషన్ ను న్యాయ రాజధానికి తరలించబోతోంది.

ఇందుకోసం కర్నూల్లో కొత్త బిల్డింగ్ ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. 20 రోజుల్లో కార్యాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది పూర్తయితే ఇక కర్నూలు నుంచి మానవ హక్కుల కమిషన్ విధులు నిర్వహించబోతోంది.
మూడు రాజధానుల ప్రక్రియలో మిగతా వ్యవహారం ఎలా ఉన్నా హక్కుల కమిషన్ రూపంలో న్యాయ రాజధానికి ఓ కార్యాలయం తరలి రావడం కీలక అడుగుగా భావిస్తున్నారు.

English summary
andhrapradesh government has decided to shift ap human rights commisson office to proposed judicial capital kurnool with high court orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X