వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్ ఎలా ఉంటుందో చెప్పేసిన సజ్జల-వారికే ప్రాధాన్యం-జగన్ తో చర్చల తర్వాత

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ తన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఇవాళ మరోసారి చర్చలు జరిపారు.
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చర్చల తర్వాత సజ్జల కేబినెట్ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కేబినెట్ కూర్పువిషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసినట్లయింది.

ఏపీలో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో కేవలం ఐదారుగురిని మాత్రమే కొనసాగించాలని భావించినా సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో పది మంది వరకూ చోటు కల్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ కొత్త, పాతల కలయికగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఉంటుందని కూడా సజ్జల వెల్లడించారు. తద్వారా ఇప్పటివరకూ సాగుతున్న ఊహాగానాలకు ఆయన స్పష్టత ఇచ్చినట్లయింది. అలాగే రేపు మధ్యాహ్నం కల్లా కొత్త మంత్రుల జాబితా వెలువడే అవకాశం ఉందని కూడా సజ్జల తెలిపారు.

jagans advisor sajjala ramakrishna reddy reveals new cabinet composition, priorities

ఇప్పటికే కేబినెట్ కూర్పు విషయంలో సీఎం జగన్ మరోసారి సామాజిక సమీకరణాల్ని భారీ ఎత్తున వడపోస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేబినెట్లో ప్రస్తుతం ఉన్న వారిలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు కొంత కోత పెట్టబోతున్నారని, అలాగే వైశ్య, క్షత్రియ సామాజికవర్గాలకు పూర్తిస్దాయిలో తప్పించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే బీసీ మంత్రులైన జయరాం, శంకర్ నారాయణ, వేణుగోపాలకృష్ణకు కొనసాగింపు ఇవ్వబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఇదే ప్రచారానికి ఊతమిచ్చేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి.

English summary
ap govt advisor sajjala ramakrishna reddy on today hold talks with cm jagan over new cabinet composition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X