• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ కుట్రలకు అడ్డు లేకుండా పోతుంది... వాళ్ళ పాపాలు బయటకి రావాలి - దేవినేని ఉమ

|
  జగన్ కుట్రలు,పాపాలు బయటకి రావాలన్న దేవినేని ఉమ || Oneindia Telugu

  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్ జగన్ కుట్రలో భాగమేనని ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. పోలింగ్ జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశిస్తారా.. అంటూ ఈసీపై మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా . రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు జగన్‌తోపాటు ప్రశాంత్ కిషోర్, విజయసాయిరెడ్డి కలిసి అనేక కుట్రలు చేశారని విమర్శించారు దేవినేని. ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయి రెడ్డి చేసిన పాపాలు బయటకు రావాలని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు.

  చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత.. చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు

  కేసీఆర్ ఆదేశాల మేరకే ఏపీలో వైసీపీ దుకాణం

  కేసీఆర్ ఆదేశాల మేరకే ఏపీలో వైసీపీ దుకాణం

  శుక్రవారం దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు . వైసీపీ అధినేత జగన్ ను ఇక తానూ భరించలేనని అందుకే ఏపీకి కేసీఆర్ వెళ్ళిపో అన్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఇప్పటి వరకు నీ పాపాలు మోసానని, ఇక తన వల్ల కాదని జగన్‌కు కేసీఆర్ స్పష్టం చేశారని ఉమ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశానని, మునిగిపోయే పడవలాంటి నిన్ను పట్టుకుని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా లేనని జగన్‌తో కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి ఉమ పేర్కొన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం నుంచి తనకు సమస్యలు ఉండకూడదంటే తెలంగాణలో వైసీపీ దుకాణాన్ని మూసేసుకోవాల్సిందేనంటూ కేసీఆర్, టీఆర్ఎస్‌ల నుంచి జగన్‌కు ఆదేశాల అందాయని అందుకే దుకాణం ఎపీకి మార్చారని ఉమ విమర్శలు గుప్పించారు .

  జగన్ కుట్రలకు అడ్డులేకుండా పోతుంది .. వాళ్ళ పాపాలు బయటకు రావాలన్న మంత్రి దేవినేని ఉమా

  జగన్ కుట్రలకు అడ్డులేకుండా పోతుంది .. వాళ్ళ పాపాలు బయటకు రావాలన్న మంత్రి దేవినేని ఉమా

  కేసీఆర్ ఆదేశాలతోనే జగన్ తన దుకాణాన్ని ఏపీకి మారుస్తున్నారని, అరాచక శక్తులు రాష్ట్రంలో అడుగుపెడుతున్నాయని, పోలీసులు, నిఘా వర్గాలు వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని ఉమ సూచించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని జగన్‌ కోట్లు ఖర్చు పెట్టారని.. ఆయన కుట్రలకు అడ్డులేకుండా పోతోందన్నారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీ గెలవాలని... కేవీపీ కుట్రలు పన్నారని ఉమ ఆరోపించారు. ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయి రెడ్డిల పాపాలు బయటపడాలని ఆయన అన్నారు . పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని.. అయితే పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్‌లైన్‌‌లో ఉందన్నారు. కేవీపీపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని దేవినేని ఉమ పేర్కొన్నారు.

  చంద్రగిరి రీ పోలింగ్ కచ్చితంగా కుట్ర అన్న మంత్రి ..34 రోజుల తర్వాత రీపోలింగ్ కి ఆదేశిస్తారా అని ఫైర్

  చంద్రగిరి రీ పోలింగ్ కచ్చితంగా కుట్ర అన్న మంత్రి ..34 రోజుల తర్వాత రీపోలింగ్ కి ఆదేశిస్తారా అని ఫైర్

  చంద్రగిరి రీ పోలింగ్ కచ్చితంగా కుట్ర అని పేర్కొన్న దేవినేని పోలింగ్ జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ కి ఆదేశిస్తారా అంటూ మండిపడ్డారు. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని, రీపోలింగ్ జరుగుతోన్న చోట్ల ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మే 23 తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ దుకాణం బంద్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

  English summary
  Minister Devineni Uma fired on the YCP chief Jagan Mohan Reddy. AP Minister Devineni Uma alleges that the issue of repolling in the 5 polling booths in Chandragiri constituency is part of Jagan's conspiracy. Does this repolling issue can be ordered after 34 days of the polling questioned Devineni Uma and fired on EC . Devineni criticized Prasanth Kishore and Vijayasai Reddy, along with Jagan, and said that they are planning to destruct the state government . Their Conspiracies and the sins are to be come out Devineni said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more