ఉద్యమించాల్సిన సమయమన్న జగన్: 'క్విట్ ఏపీ' నినాదంతో దోపిడీ పాలకులపై!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీలో వైసీపీ దూకుడు పెంచుతోంది. నంద్యాల ఉపఎన్నికను కైవసం చేసుకుని భవిష్యత్తు రాజకీయాలను శాసించడానికి వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరును, అభ్యర్థుల ఎంపికను పరిశీలిస్తోంది.

ఈ నేపథ్యంలోనే 'క్విట్ ఇండియా' నినాదాన్ని సైతం ఆ పార్టీ స్పూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 75ఏళ్లు పూర్తి చేసుకున్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్‌లో స్పందించారు.

'75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్య‌మానికి భార‌తీయుడిగా సెల్యూట్ చేస్తున్నా!.. ఆ ఉద్య‌మం నిరంత‌రం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన‌మంతా- మోస‌గాళ్లారా.. దోపిడీ పాల‌కులారా.. ప్రజా వంచ‌కులారా క్విట్ ఏపీ అని ఉద్య‌మించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది' అని ఆయ‌న ట్వీట్ చేశారు.

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls

జగన్ క్విట్ ఏపీ నినాదం ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. టీడీపీ రాజకీయాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పోస్టు చేసినట్లుగా స్పష్టమవుతోంది. కాగా, ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి లోకేష్.. జగన్ క్విట్ ఏపీ నినాదానికి కౌంటర్ ఇస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP President Jagan indirectly countered TDP through twitter by posting 'QUIT AP' slogan.
Please Wait while comments are loading...