వైసిపి భారీ మెజార్టీ సాధిస్తుంది: మహిళల ఓట్లు వైసిపి కే: ఇది ప్రజా విజయం : జగన్..!
ఏపిలో జరిగిన ఎన్నికల్లో లాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని వైసిపి అధినేత జగన్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో 85 శా తం వరకు పోలింగ్ జరగటం శుభ సూచికం అన్నారు. పోలింగ్ జరగకుండా..పోలింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబా బు దిగజారి వ్యవహరించారని ఆరోపించారు. మహిళా ఓటర్లు వైసిపి కే అండగా నిలిచారన్నారు.
చంద్రబాబు కుట్రలు ప్రజలు తిప్పికొట్టారు..
పోలింగ్ ముగిసిన తరువాత వైసిపి అధినేత జగన్ తమ విజయం పై ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల పోలింగ్ శాతం భారీగా ఉందని దాదాపు 85 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి సీయం తన స్థాయిని దిగజారి ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తు న్నారని విమర్శించారు. ఓటింగ్ శాతం తగ్గించాలని కుట్రలు చేయటం తో పాటుగా అనేక డ్రామాలు..అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేసారన్నారు. అయినా..ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించార ని వివరించారు. ఓటింగ్ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆటు పోట్లను తట్టుకొని పార్టీ తరపున నిలబ డిన ప్రతీ కార్యకర్తకు..నాయకుడికి అభినందనలు తెలిపారు. కొంత మంది గాయాల పాలయ్యారని..ఇద్దరు పార్టీ సాను భూతి పరులు ప్రాణాలు పోగొట్టుకున్నారని వివరించారు.

ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వబోతున్నారు..
పోలింగ్ సరళి పూర్తిగా తమకే అనుకూలంగా ఉందని..ల్యాండ్ సైడ్ విక్టరీ సాధిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేసారు. మ హిళా ఓటర్లు భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనటం తమకు శుభ సూచికం అన్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు .. రైతులకు ఇచ్చిన రుణాల మాఫీ జరగలేదనే ఆగ్రహంతో చంద్రబాబు కు వ్యతిరేకంగా ఓటింగ్ చేసారని వివరించారు. ప్రజా తీర్పు చూసి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. ఓటమి నుండి తప్పించుకోవటానికి చంద్రబాబు దిగజారి వ్యవహరించారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యే అభ్యర్దుల పై దాడులు చేసారన్నారు. మంగళగి రి లో నారా లోకేశ్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్ జరగటం ప్రజా విజయం అన్నారు.












Click it and Unblock the Notifications