వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు జగన్ మార్క్ షాక్; గాంధీ జయంతి నాడు ఆ ప్లాన్ భగ్నం.. వైసీపీ రాజకీయం షురూ !!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి మార్క్ రాజకీయం కొనసాగుతోంది. రాజకీయాలంటే ఎలా ఉంటాయో ముందు ముందు చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ కు రాజకీయం అంటే ఇలా ఉంటుంది అని చూపించే ప్రయత్నం చేస్తోంది వైసిపి. అందులో భాగంగా పవన్ కు భారీ షాక్ ఇస్తోంది. గాంధీ జయంతి నాడు, అక్టోబరు రెండవ తేదీన రాష్ట్రంలో వైసీపీ పాలనలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం రంగంలోకి దిగనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో ఊహించని షాక్ ఇస్తోంది. ఆయన ప్లాన్ ను భగ్నం చేసే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఆ డెడ్ లైన్ పూర్తి; గాంధీ జయంతి సాక్షిగా రంగంలోకి పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వ 'పాలసీ ఉగ్రవాదం' పై ట్వీట్ఆ డెడ్ లైన్ పూర్తి; గాంధీ జయంతి సాక్షిగా రంగంలోకి పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వ 'పాలసీ ఉగ్రవాదం' పై ట్వీట్

 పవన్ కళ్యాణ్ ను అడ్డుకునే పనిలో వైసీపీ .. జగన్ కు చెక్ పెడతానన్న పవన్

పవన్ కళ్యాణ్ ను అడ్డుకునే పనిలో వైసీపీ .. జగన్ కు చెక్ పెడతానన్న పవన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై దండయాత్ర మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ సంకల్పిస్తే, పవన్ కళ్యాణ్ దండయాత్రను అడ్డుకోవడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీలా కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంది వైసీపీ. ఇక వైసీపీ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటన చేశారు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ వైసిపి సర్కార్ కు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాజకీయాల్లో కలుపుమొక్కలను తీసేయాలి అంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ పై వ్యూహం మొదలెట్టిన వైసీపీ

పవన్ కళ్యాణ్ పై వ్యూహం మొదలెట్టిన వైసీపీ

ఇదే సమయంలో ఏ ఒక్కరిని మర్చిపోనని దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలలో మునుముందు వైసీపీ సర్కార్ పై పవన్ యుద్ధం చేస్తాడని అందరూ భావిస్తుంటే పవన్ కళ్యాణ్ ను నిలువరించాలని వైసిపి వ్యూహం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. తాజా పరిణామాలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే శ్రమదానం కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించారు.

 రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం.. 2 వ తేదీన పవన్ కళ్యాణ్ శ్రమదానం

రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం.. 2 వ తేదీన పవన్ కళ్యాణ్ శ్రమదానం

ఇటీవల రాష్ట్రంలో రోడ్ల అధ్వానంగా ఉన్నాయని, గుంతల మయం అయిన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ వినూత్న నిరసనలు దిగిన విషయం తెలిసిందే. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని అందరికీ తెలిసేలా ప్రచారం చేసింది. అంతే కాదు ఇదే సమయంలో ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చింది. రోడ్ల మరమ్మత్తుల కోసం ఆందోళనలు చేసిన జనసేన, ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. నాలుగు వారాల గడువు ఇచ్చి వాటికిమరమ్మత్తులు చేయాలని విజ్ఞప్తి చేసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవటంతో ఇంతకాలం నిరీక్షించిన జనసేన,అక్టోబరు రెండవ తేదీన నేరుగాపవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు ప్రకటించింది.

 గాంధీ జయంతిన రెండు చోట్ల పవన్ శ్రమదానం ప్లాన్ .. కానీ

గాంధీ జయంతిన రెండు చోట్ల పవన్ శ్రమదానం ప్లాన్ .. కానీ


అక్టోబర్ 2వ తేదీన రాజమండ్రిలో శ్రమదానం చేయడానికి పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై రహదారికి మరమ్మత్తులు చేయనున్నట్టు, ఆపై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో కొత్త చెరువు వద్ద శ్రమదానం చెయ్యనున్నట్టు పేర్కొంది. నేరుగా పవన్ కళ్యాణ్ఈ శ్రమదానంలోపాల్గొననున్నట్టుపేర్కొంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ పై శ్రమదానం చేయడానికి అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్ఈ ప్రకటించారు.

ధవళేశ్వరం బ్యారేజ్ పై అనుమతి లేదన్న ఇరిగేషన్ ఎస్ఈ

ధవళేశ్వరం బ్యారేజ్ పై అనుమతి లేదన్న ఇరిగేషన్ ఎస్ఈ

కాటన్ బ్యారేజ్ రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి రాదని, పేర్కొన్నారు. కేవలం మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతిస్తున్నామని ఇరిగేషన్ ఎస్ ఈ వెల్లడించారు. అంతే కాదు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ధవళేశ్వరం బ్యారేజీ పై శ్రమ దానం చేయడానికి అనుమతి కుదరదని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఇక కావాలనే పవన్ కళ్యాణ్ పర్యటనకు వైసిపి అవాంతరాలు సృష్టిస్తుందని జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసి తీరుతానని తేల్చి చెబుతున్నారు.

అనంతపురం కొత్త చెరువులోనూ వైసీపీ వ్యూహం .. మరమ్మత్తు పనులు షురూ

అనంతపురం కొత్త చెరువులోనూ వైసీపీ వ్యూహం .. మరమ్మత్తు పనులు షురూ

మరోవైపు పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో కూడా పవన్ పర్యటన ఉన్న కారణంగా రోడ్ల మరమ్మతు కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు అనగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు వద్ద తూతూమంత్రంగా రోడ్ల మరమ్మతులు మొదలుపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ జనసేన పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

పవన్ ప్లాన్ భగ్నం చేస్తున్న వైసీపీ .. అప్పుడే పవన్ కు జగన్ మార్క్ షాక్

అనంతపురం జిల్లాలో జనసేనాని శ్రమదానం నిర్వహించనున్న కొత్తచెరువులో కూడా రోడ్ల మరమ్మతు పనులు పూర్తిచేసి పవన్ కళ్యాణ్ ప్లాన్ ను భగ్నం చేయాలని వైసిపి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు సామాజిక కార్యకర్తగా పని చేశానని, రాజకీయం చేయలేదని ఇకముందు రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ కు వైసిపి మార్కు రాజకీయాన్ని అప్పుడే రుచి చూపిస్తోంది అని తాజా పరిణామాలతో స్పష్టంగా అర్థమవుతోంది.

English summary
Jagan govt gave an unexpected shock to Janasena Pawan Kalyan, who will enter the field for road repairs on gandhi jayanti. Permission was denied to work on the Dhawaleswaram Barrage. Undertook repairs ysrcp itself in ananthapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X