హైదరాబాద్‌లో గౌతమ్ అదానీతో వైఎస్ జగన్ భేటీ: విశాఖలో భారీ ప్రాజెక్లులకు శంకుస్థాపన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఉదయం 8.10 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు ఆయన చేరుకుంటారు. తిరిగి పది నిమిషాల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతోపాటు విశాఖపట్నం వెళ్లనున్నారు.
బుధవారం విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం జగన్, గౌతమ్ అదానీ పాల్గొంటారు. విశాఖలో అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు సీఎం జగన్, గౌతమ్ అదానీ శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడలో ఇంటిగ్రేటెడ్, డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్‌లను రూ. 14,634 కోట్ల పెట్టుబడితో అదానీ సంస్థ ఏర్పాటు చేయనుంది.
130 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్ట్-1తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కాపులుప్పాడలో మరో డేటా సెంటర్, టెక్ పార్క్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడలో రూ.7210 కోట్లతో ఏర్పాటు కానున్న టెక్ పార్క్ ద్వారా 20,450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు ప్రాజెక్టులతో విశాఖకు రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు సహా 45వేల మందికిపైగా ఉద్యోగాలు దక్కనున్నాయి.

మరోవైపు, భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్-1లో రూ. 4600 కోట్ల పెట్టుబడితో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరగనుంది. జీఎంఆర్ సంస్థ ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని చేపడుతోంది. 6 మిలియన్ ప్యాసింజర్ కెపాసిటీతో విమానాశ్రయం నిర్మాణం జరగనుంది. 2,203 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది.
అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష: కీలక ఆదేశాలు
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో మంగళవారం సీఎం జగన్ సమీక్షించారు. వర్షాలపై రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. నివేదిక ఖరారు చేయాలని ఆదేశించారు.
మే నెలలోనే వైయస్సార్ రైతు భరోసాతోపాటు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌పుట్ సబ్సిడీ జారీకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తి చేయాలన్నారు. మర్చి నెలలో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనాలు తయారు చేశామని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జరిగిన పంట నష్టం అంచనాలపైనా ఎన్యుమరేషన్ చురుగ్గా కొనసాగుతోందని సీఎంకి తెలిపారు.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
MMTS సర్వీసులపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..











Click it and Unblock the Notifications