నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..
Recommended Video
ఏపీలో ఎన్నికల సమరం ముగిసినా ఇంక యుద్ధవాతావరణం కొనసాగుతుంది. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఏపీని రణరంగం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల తర్వాత కూడా తమ చర్యలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
ఇక తాజాగా రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో నెలకొన్న అరాచక వాతావరణంపై తాజా పరిస్థితులపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బృదం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనుంది.

మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు వైసీపీ ప్రతినిధి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. పోలింగ్ ముగిశాక తమ పార్టీ వారిపై, తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తూన్నారు జగన్. దీనిపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలనా తీరుపై, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులపై కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications