వందేళ్లైనా సీఎం కాలేరు: కెఈ, దుష్టశక్తి జగన్ చూల్లేదా, అర్థం కాలేదా: యనమల

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వందేళ్లయినా ముఖ్యమంత్రి కాలేరని ఏపీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మంగళవారం నాడు అన్నారు.

పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి తమ ప్రభుత్వం నీళ్లు తెస్తుంటే వైయస్ జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. నదుల అనుసంధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

Jagan will not become Chief Minister: KE

ఇంజినీర్ల వల్లే: ఏపీ సీఎం

కరవును పారదోలేందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిభ గల ఇంజినీర్ల వల్లే భారత్‌లో అద్భుతమైన కట్టడాలు నిర్మించగలిగారని కొనియాడారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ఇంజినీర్స్‌ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. భారత ఇంజినీర్లలో మొదటిస్థానంలో ఉన్న వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. ఇంజినీర్ల ప్రతిభ వల్లే పట్టిసీమ ప్రాజెక్టును అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేశామన్నారు. వారి కృషి వల్లే కేవలం ఐదు నెలల 15 రోజుల్లో పట్టిసీమను పూర్తి చేయగలిగామన్నారు.

యువత ఇంజినీరింగ్‌పై ఆసక్తి పెంచుకోవాలని, వినూత్న ఆలోచనలతో దేశంలో కరవును తరిమికొట్టేలా ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణంలోనూ ఇంజనీర్లు ప్రతిభ చూపించి ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నారు.

రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారా కరవును తరిమి కొడతామన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని నదుల అనుసంధానం ద్వారా వినియోగంలోకి తెస్తామన్నారు. పోలవరం పూర్తి చేయాలంటే నాలుగైదేళ్లు పడుతుందని, అందుకే పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనుకున్నామన్నారు.

జగన్ చూడలేదా, దుష్టశక్తి: యనమల

ప్రపంచ బ్యాంక్ నివేదికను జగన్ చూడలేదా లేక అర్థం కాలేదా అని ఆర్థిక శాఖ మత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి జగన్ దుష్టశక్తిగా మారారని మండిపడ్డారు. పెట్టుబడులకు ఏపీ అనుకూలమని
కేవలం 14 నెలల్లోనే రావడం చంద్రబాబు ఘనత కాదా అని ప్రశ్నించారు. రేపు కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం కనిపించడం లేదా అన్నారు. ఏపీ వాతావరణాన్ని కలుషితం చేసే దుష్టశక్తిలా మారాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+