జగన్ అప్పుడే నిజం చెప్తారు:యనమల, టి ప్రభుత్వంపై

జగన్ మాట్లాడుతుండగా యనమల లేచి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎదురుగా సత్యమేవ జయతే బోర్డు పెట్టాల్సి ఉన్నప్పటికీ ఇంకా పెట్టలేదని, దానిని త్వరగా పెడితేనైనా జగన్ అది చూసి నిజాలు మాట్లాడుతారని యనమల ఎద్దేవా చేశారు. ఆ బోర్డు త్వరగా పెడితే బావుంటుందన్నారు.
ఆగస్టు 15 వేడుకలను తాము కర్నూలు జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. యనమల తెలంగాణ ప్రభుత్వం పైన కూడా మండిపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌ను ఎపి విద్యార్థులకు ఇవ్వకుండా ఉండేందుకే తండ్రి స్థానికత అని తెలంగాణ ప్రభుత్వం అంటోందని విమర్శించారు.
విద్యార్థి మాత్రమే తెలంగాణలో పుడితే సరిపోదని... విద్యార్థి తండ్రి కూడా తెలంగాణలో పుడితేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలన్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిని యనమల తప్పుబట్టారు. తండ్రి స్థానికతను అడగడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం తండ్రి స్థానికతను అడుగుతోందని ఆరోపించారు.
మరోవైపు, కృష్ణాడెల్టాకు రేపటి నుంచి నీటిని విడుదల చేయాలనే నిర్ణయం ఇప్పటిది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రజలకు తాగునీరు ఇచ్చే అంశంపై రాజకీయం తగదన్నారు. జూలై 9వ తేదీ వరకు 10 టీఎంసీల తాగునీటిని విడుదల చేయాలని రాష్ట్రపతి పాలన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారన్నారు. సకాలంలో నీటి విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications