జైలర్ ఎఫెక్ట్: షారూఖ్ ఖాన్, ప్రభాస్, దళపతి విజయ్ లకు షాకిచ్చిన రజినీకాంత్!!
తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ మళ్లీ టాప్ పొజిషన్లో నిలిచారు. అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో అగ్రభాగాన ఆయన స్థానం సంపాదించుకున్నారు. జైలర్ సినిమాతో రజినీకాంత్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లకు షాకిచ్చారు. అత్యధిక పారితోషకం పొందే టాప్ టెన్ భారతీయ నటులలో రజినీకాంత్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఐఎండీబీ నివేదికల ప్రకారం రజినీకాంత్ కు జైలర్ సినిమాకు 210 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు అదనంగా మరో వంద కోట్లు ఇచ్చారు. అంతేకాదు ఆయనకు ఒక బ్రాండెడ్ కారును కూడా బహుమతిగా ఇచ్చారు. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రజినీకాంత్ నిలిచారు.

ఐఎండీబీ నివేదిక ప్రకారం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకు 100 కోట్ల నుండి200 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం. అలాగే అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమా కోసం షారుక్ ఖాన్ 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సాలార్ సినిమా కోసం ప్రభాస్ కు 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నట్టు ఐఎండీబీ పేర్కొంది.
త్రీ ఇడియట్స్ సినిమా కోసం అమీర్ ఖాన్ 100 కోట్ల నుండి 175 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక లియో సినిమా కోసం తలపతి విజయ్ 120 కోట్ల నుండి 150 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. టైగర్ త్రీ సినిమా కోసం సల్మాన్ ఖాన్ 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇండియన్ టు కోసం కమల్ హాసన్ 50 కోట్ల నుండి 150 కోట్లు తీసుకుంటాడని సమాచారం.ఇక అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా కోసం 60 కోట్ల నుండి 135 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ గా 100 కోట్ల రూపాయలను తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ ఒక సినిమాకి 90 కోట్ల నుండి 100 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications