కేసీఆర్! కలిసున్నాం గుర్తుందా, మేం పేదోళ్లం: బాబును ఏకేసిన జగన్

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన జల దీక్షను విరమించే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటు కేసీఆర్‌ను, అటు మోడీని అడిగే ధైర్యం బాబుకు లేదన్నారు.

మన దీక్ష వల్ల వారి మనసులు కరుగుతాయేమోనని అందరం భావించామన్నారు. జగన్ మాట్లాడుతూ.. 'అయ్యా! కేసీఆర్.. మొన్నటిదాకా మనమంతా కలిసి కట్టి ఉన్నాం. అందరం తెలుగే మాట్లాడుతాం. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు కలిసి కట్టుగా ఉన్నాం.

పై ప్రాజెక్టులు కడితే కింది రాష్ట్రాలకు నీళ్లు రావని అందరం కలిసి బాబ్లీ, అలమట్టి పైన పోరాడాం. అది మీకు గుర్తుకు రావడం లేదా అని కెసిఆర్‌ను అడుగుతున్నాం. అయ్యా, మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. కేవలం ఇవాళ ఉన్న నీళ్ల పరిస్థితి ఏమిటో ఆలోచించండి.

మహారాష్ట్ర, కర్నాటకలు నీళ్లు వదిలితే కానీ రావు. అది తెలిసి అప్పుడు సమైక్య ఏపీలో పోరాడం. అది మీకు తెలుసు. ఇది తెలిసి కూడా మహబూబ్ నగర్లో ప్రాజెక్టులు కట్టి పైకి నీళ్లు తీసుకుపోతామంటే అది అన్యాయం కాదా అని కేసీఆర్‌ను అడుగుతున్నాను.

Jala deeksha ends, Jagan lashes out at KCR, Chandrababu

గోదావరి నది ఏపీకి రాకముందే ఎడాపెడా దాదాపు రోజుకు 70వేల క్యూసెక్సుల నీటిని తోడుకుందామనుకుంటే కింద ఉన్న రైతులకు నీళ్లు ఎలా వస్తాయనే ఆలోచన మీకు రావడం లేదా. ఇదే కెసిఆర్‌ను నేను అడుగుతున్నా. నీళ్లు వచ్చే పై రాష్ట్రం మాది అయితే, మేం నీళ్లు ఆపి ఉంటే మీకు నచ్చేదా అని అడుగుతున్న ఇదే కేసీఆర్‌ను.

ఇవాళ పాలించే వాళ్లు, పాలకులుగా ఉన్న వాళ్లు.. ఎవరైనా మనవాళ్లు అని మరిచిపోకూడదు. ఎప్పుడైతే మరిచిపోతారో అప్పుడు విభేదాలు మొదలవుతాయి. ఎప్పుడైతే నాది అని మొదలు పెడతారో అదే పరిస్థితి మీకు వస్తుందని మర్చిపోవద్దు. ఇవాళ మనం మనం తన్నుకోవడం, గొడవలు పడటం కాదు.

అందరం కలిసి కట్టుగా ఒక్కటై అన్యాయం జరక్కుండా చూడాలి. అందరం ఒక్కటవుదాం. మహారాష్ట్ర నుంచి, కర్నాటక నుంచి, తెలంగాణ నుంచి, ఏపీ వరకు అందరం పాలకుల్లా ఆలోచించే పని చేయాలి. కరువు వచ్చినప్పుడు పైన వర్షాలు పడితే కిందకు నీళ్లు రాకుంటే.. మాకు వచ్చిన నీళ్లు మేమే తీసుకుంటామంటే కింద ఏమవుతారో ఆలోచించారు.

కేసిఆర్ కూడా ఓసారి ఆలోచించాలి. మహారాష్ట్ర, కర్నాటకలు కూడా అలాగే ఆలోచిస్తే.. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు చుక్క నీరు రాదు. కర్నాటక నుంచి తెలంగాణకు ఒక్క చుక్క నీరు రాదు. తెలంగాణ నుంచి ఏపీకి చుక్క నీరు రాదు.

దామాషా లెక్కల ప్రకారం నీరు వదలాలి

జగన్ ఇంకా మాట్లాడుతూ... నీటిని దామాషా లెక్కల ప్రకారం కిందకు వదిలే పని చేయాలన్నారు. పదిహేను రోజులకు ఓసారి నీటి పంపిణీ చేయాలన్నారు. అప్పుడు కరువు వస్తే అందరికీ వస్తాయన్నారు. వరదలు వచ్చినప్పుడు పై రాష్ట్రాలు ఇష్టారీతిగా నీళ్లు వదిలేసి కింది రాష్ట్రాలు మునిగిపోయే పరిస్థితి తగ్గుతుందన్నారు.

పాలమూరులోని ప్రాజెక్టుల పైన కేసీఆర్ ఓసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలన్నారు. కెసిఆర్ ఏపీకి చేసేది అన్యాయం కాదా అన్నారు. విభజన చట్టంలో పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు, గోదావరి నదిపై కట్టే ప్రాజెక్టులు ఉన్నాయా అని నిలదీశారు. ఈ ప్రాజెక్టులు విభజన చట్టంలో లేవన్నారు.

మీకు బలం ఉందని పేదవాళ్లమైన మాపై ప్రతాపం చూపిస్తారా

మీకు బలం ఉందని, మీ చేతిలో అధికారం ఉందని, పేదవాళ్లమైన, బీదవాళ్లమైన మా పైన ప్రతాపం చూపించడం ధర్మమేనా అని అడుగుతున్నానని అన్నారు. ఈ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా అని నిలదీశారు. ప్రాజెక్టులకు అనుమతులు లేకున్నా.. మా రాష్ట్రం నుంచి నీరు పోవాలి కాబట్టి మా ఇష్టం అంటే ఎలా అన్నారు.

కేసీఆర్ వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రాదన్నారు. అప్పుడు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగడానికి నీళ్లు ఉండవన్నారు. గోదావరి జిల్లాల్లో రబీ పంట పడకుంటే ఉప్పు శాతం పెరిగి.. పంటలు పండే భూములు కూడా బంజరు భూములు అవుతాయన్నారు. ఇది కేసీఆర్‌కు తెలుసునని, తెలిసి కూడా అన్యాయం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు కెసిఆర్‌ని, మోడీని నిలదీయరు

కేసీఆర్ ఇంత అన్యాయం చేస్తున్న మన సీఎం చంద్రబాబు అడగరు, పోరాడరన్నారు. కేసీఆర్‌ను నిలదీయలేరన్నారు. చంద్రబాబు నిలదీసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఓటుకు నోటును తెరపైకి తీసుకు వస్తారన్నారు. కేసిఆర్‌ను అడిగితే నన్ను ఎక్కడ జైల్లో పెట్టిస్తాడోనని బాబుకు భయమన్నారు.

పోనీ ఢిల్లీలో, ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతారా అంటే అదీ అడగరన్నారు. చంద్రబాబు ఈ రెండేళ్లలో లెక్కలేనంత అవినీతి చేశారన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై నిలదీసినా, విభజన హామీలపై నిలదీసినా... ప్రధాని మోడీ.. చంద్రబాబు అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయిస్తారేమో అన్నారు.

ఆ భయంతోనే చంద్రబాబు ఢిల్లీలోను నిలదీయడం లేదన్నారు. ఇంతదానికి చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందని చంద్రబాబే అంటారన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని చంద్రబాబే చెప్పడం విడ్డూరమన్నారు.

కేసీఆర్ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా, మోడీ హోదా ఇవ్వకున్నా వారిని నిలదీయలేరన్నారు. మోడీతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారని, ఆ సమావేశంలో ఓ విలేకరి చంద్రబాబును తెలంగాణ ప్రాజెక్టుల పైన ఉద్దేశించి ఓ ప్రశ్న వేశారని, దానికి ఆయన సమాధానం విడ్డూరంగా ఉందన్నారు. అనుమతులు తీసుకొని కట్టాలని చెప్పారన్నారు.

చంద్రబాబును చూసి మనమంతా సిగ్గుపడాలి

ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మనమంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి అన్నారు. గతంలో చంద్రబాబు పదేళ్ల పాటు సీఎంగా ఉన్నారని, అప్పుడు బాబ్లీ కట్టినా ఏం మాట్లాడలేదన్నారు. ఇప్పుడు కేసీఆర్ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

చంద్రబాబు తీరు ఊరు తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిలా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చేయలేదన్నారు. ఏపీ తగలబడుతుంటే ఏం చేయలేరన్నారు. ఏపీ తగలపడుతుంటే ఆయన పిడేల్ వాయిస్తున్నాడన్నారు. ఆయన పాలన దారుణంగా ఉందన్నారు.

అక్రమ ప్రాజెక్టులు ఆగాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా మనమంతా ఒక్కటి కావాలన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉద్యమించాలన్నారు. ఇలాగే ఉంటే కొట్లాడుకునే పరిస్థితి ఉందన్నారు.

మనకు న్యాయం జరగాలంటే అందరం కలిసి కట్టుగా పోరాడాలన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పైన గట్టిగా ఒత్తిడి తెద్దామన్నారు. చంద్రబాబులో మార్పు రాకుంటే గోదావరి వద్ద దీక్ష చేస్తామన్నారు. అప్పటికైనా కెసిఆర్, బాబుకు మానవత్వం కలుగుతుందో చూద్దామన్నారు.

చంద్రబాబు ప్రత్యేక హోదా అడిగి ఉండడు

ప్రధానితో భేటీ అయిన బాబు ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగి ఉండరని అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా వల్ల ఏమి లాభమంటూ చంద్రబాబు ప్రశ్నించడం సబబుగా లేదన్నారు. కనీసం తెలంగాణలో నిర్మించే అక్రమ ప్రాజెక్టుల పైన ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని ఆశించామన్నారు. చంద్రబాబులో మార్పు రాకపోతే వచ్చే నెలలో గోదావరి నదిపై దీక్ష చేపడతాని జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+