వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ , ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా ఆనంద్ సూర్య రాజీనామా

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వక్ఫ్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకోకుంటే బలవంతంగా తప్పించాల్సి వస్తుందన్న సమాచారం రావడంతోనే జలీల్ ఖాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.ఇక ఆయన మాత్రమే కాదు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవికి టీడీపీ నేత ఆనంద్ సూర్య కూడా రాజీనామా సమర్పించారు.

ఏపీలో డీజీపీ పదవి రావాలంటే ఓ సెంటిమెంట్ ఉందట .. ఏంటది ? ఏమా కథ ?ఏపీలో డీజీపీ పదవి రావాలంటే ఓ సెంటిమెంట్ ఉందట .. ఏంటది ? ఏమా కథ ?

 బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య రాజీనామా.. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశానని వెల్లడి

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య రాజీనామా.. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశానని వెల్లడి

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా 23 నెలల పాటు తాను సేవలు అందించానని ఆనంద్ సూర్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలగించకముందే ఆయన గౌరవంగా తప్పుకున్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆనంద్ సూర్య తన పదవీకాలంలో ఏపీలోని బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశానని ఆయన తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చాలని కోరారు. భవిష్యత్ లో ఏపీలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ రాజీనామా.. చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని ఆవేదన

వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ రాజీనామా.. చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని ఆవేదన

వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ రాజీనామా చేసిన అనంతరం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అద్భుతమైన అభివృద్ధి పనులు చేబట్టిందని జలీల్ ఖాన్ తెలిపారు. విజయవాడ పశ్చిమలోనే 1600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.21 కోట్లు అందించానని చెప్పారు. కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలను క్రమబద్ధీకరణ చేయించామని వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు అంటూ లేకుండా చేశామని పేర్కొన్నారు.

సంసారం కూడా పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి చేశారని చంద్రబాబుకు కితాబు

సంసారం కూడా పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి చేశారని చంద్రబాబుకు కితాబు

ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని పేర్కొన్న ఆయన ఈసారి కుల రాజకీయాలు ఎక్కువగా నడిచాయని అభిప్రాయపడ్డారు. అంతే కాదు నగదు రేస్ నడిచిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అప్పటి సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమించారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ఏపీ కోసం రాత్రీపగలు తేడా లేకుండా సంసారం కోసం కూడా సమయం కేటాయించకుండా కష్టపడ్డారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ఇంత కష్టపడి అభివృద్ధి చేసినా ప్రజలు టీడీపీని ఓడించడం చాలా ఆవేదనగా ఉందని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

English summary
TDP leader Vijayawada West constituency former MLA Jaleel Khan resigned as chairman of AP Wakf Board. Jalil Khan had been forcefully resigned from his post as he was blackmailed that if he don't go away he will be forced to get out of the Waqf Board . TDP leader Anand Surya also submitted his resignation to AP Brahmin Corporation. In his tenure, he said that he has worked hard for Brahmins in the AP. The TDP leaders asked chief minister Jagan to fulfill the promises that he made during the AP Assembly polls. In the future, the TDP leader Anand Surya said that he will work to strengthen TDP . Jaleel Khan also said that he respect's the judgment given by the people, he has been working hard for five years, but it is very disappointing that people defeat TDP said Jaleel Khan .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X