జాంపండు రంగుల పథకం... హోలీ నాడు జగన్ పై గోరంట్ల సెటైర్లు ... ఏమన్నారంటే
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై, నేతలపై విరుచుకుపడ్డారు . ఆ మధ్య సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై అశ్లీల భాష యొక్క పాఠశాల షార్ట్ టర్మ్ కోర్స్ ఉందని , ఇక ఆతర్వాత కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు ..వైసీపీ సినిమా అంటూ రకరకాల పోస్ట్ లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన గోరంట్ల తాజాగా హోలీ నాడు జగన్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.

రంగుల జలగం అని సీఎం జగన్‌ను టార్గెట్ చేసిన గోరంట్ల
జగన్ సర్కార్‌పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ‘ఓలి రాంగోలి' అంటూ చేసిన ట్వీట్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. పాలన మొత్తం రంగులమయమైందని, అన్ని భవనాలకు రంగులేసి, ఆపై సున్నం పూసి అంటూ రంగుల జలగం అని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోలీ సందర్భంగా జాంపండు రంగుల పథకం ప్రారంభమైందంటూ జగన్ పాలనపై సెటైర్ వేశారు.

జాంపండు రంగుల పథకం అంటూ సెటైర్
ఇక ఆయన చేసిన ట్వీట్ సారాంశం గమనిస్తే ‘‘రాష్ట్రంలో జలగం ప్రవేశ పెట్టిన రంగులు మూడు. అవి నీలం, తెలుపు, ఆకుపచ్చ. ఈ రంగులు జలగన్న కార్యాలయాల్లో వాలంటీర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. దీనికి జాంపండు రంగులు పథకం అని నామకరణం చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి .దీనిని అట్టహాసంగా 151 మంది కళాకారులతో శ్రీ జాంపండు గారు ప్రారంభిస్తారు. ముందుగా ఏ2 వెలగపండు గారు, ఏ1 జాంపండు గారికి మూడు రంగులు పూసి ప్రారంభిస్తారు. ఈ రంగులు స్వచ్ఛమైన అవినీతి మరకలకి ప్రసిద్ధి. దీనిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పూసి ఆనందించాలని జాంపండు అలియాస్ జలగం కంకణం కట్టుకున్నారు. మొత్తానికి రంగు పడింది అని జనాలు అనుకుంటున్నారు''. అని పోస్ట్ చేశారు .
Recommended Video


ఆసక్తికరంగా టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోస్ట్
సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు తమ పార్టీ రంగులు వేయటాన్ని రంగుల పథకంగా అభివర్ణించి , ఇక వైసీపీ రంగులను అవినీతి మరకలుగా పేర్కొన్నారు. కలర్స్ సీఎం, ఫెయిల్డ్ సీఎం జగన్ హ్యాష్ ట్యాగ్‌లతో ఈ ట్వీట్ చేశారు. ఇక చాలా వ్యంగ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలోని అధికార వైసీపీపై చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications