ఏదైనా ఒకటే: జానారెడ్డి వేదాంతం, దొరలవల్లేనని దానం

పిసిసి కమిటీపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పారు. తెలంగాణలో తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని చెప్పారు. కమిటీ విషయంలో తాను అధిష్టానాన్ని ప్రశ్నించనని చెప్పారు.
తాను ఏళ్లుగా పార్టీ కోసం, తెలంగాణ కోసం ఎంతగా కష్టపడ్డానో కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పారు. పదవుల కోసం తాను ఎప్పుడు పాకులాడలేదని చెప్పారు. రాహుల్ గాంధీతో పార్టీ బలోపేతంపై చర్చించానన్నారు. పార్టీని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదన్నారు. టిపిసిసి చీఫ్‌గా ఎన్నికైన పొన్నాల లక్ష్మయ్యకు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు జానా శుభాకాంక్షలు తెలిపారు.
తాను ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్లో దిగలేదని, పైరవీలు చేయలేదన్నారు. కొందరికి ఢిల్లీలో ఉన్న కమాండ్ ప్రజల్లో ఉండదన్నారు. వ్యక్తుల కింద కాదు కాంగ్రెసు శక్తుల కింద తాను పని చేస్తానని చెప్పారు. గాంధీలాగే తాను పదవులు ఆశించకుండా పని చేస్తానన్నారు. తన నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందని ప్రజలకు తెలుసునన్నారు. పొన్నాలను ఎందుకు ఎంపిక చేశారో తనకు తెలియదన్నారు. పదవి ఇవ్వాలని ఎవ్వరిని అడగలేదన్నారు.
దొరల పెత్తనం సాగనివ్వం: దానం
తెలంగాణ ప్రాంతంలో తాము ఎట్టి పరిస్థితుల్లో దొరల పెత్తనం సాగనివ్వమని మాజీ మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులో అన్నారు. కాంగ్రెసులోను దొరల పెత్తనం ఉందన్నారు. తనకు పిసిసి పదవి రాకుండా చేసింది ఆ దొరలే అన్నారు. బడుగు, బలహీనవర్గాల వారికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. కాగా ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చారు.












Click it and Unblock the Notifications