ఏపీలో 2019 ప్ర‌భుత్వ ఏర్పాటులో కీలకం కానున్న జ‌న‌సేన..!!

హైద‌రాబాద్/ఏపి: వ‌చ్చే ఎన్నిక‌ల‌ల్లో ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో భిన్న కోణాలు ఆవిష్క్రుత‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విభ‌జ‌న త‌ర్వాత ఆంద్ర‌ప్ర‌దేశ్ లో అదికార టీడిపి, ప్ర‌తిప‌క్ష వైసీపి ల మ‌ద్య మాత్ర‌మే పోటీ నెల‌కొని ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఉరుములా వ‌చ్చి మెరుపులా దూసుకెళ్తున్న జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల్లో అదికార పార్టీకి గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

అంతే కాకుండా ఎంకి పెళ్లి సుబ్బి చావుకు చేట‌యింద‌న్న చందంగా వైసీపి నేత‌లు ఇప్పుడు జ‌న‌సేన పైపు చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపిలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే స‌మ‌యానికి వైసీపి నుండి చాలా మంది నేత‌లు జ‌న‌సేన గూటికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వైసీపి నేత‌ల‌కు ఎలా అడ్డుక‌ట్ట వేయాలో అర్థం కాక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల‌ప‌ట్టుకుంటున్న‌ట్టు లోట‌స్ పాండ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.

ఏపీలో వ‌చ్చేది సంకీర్ణ‌మే..! చ‌క్రం తిప్పేది జ‌న‌సేన పార్టీనే..!!

ఏపీలో వ‌చ్చేది సంకీర్ణ‌మే..! చ‌క్రం తిప్పేది జ‌న‌సేన పార్టీనే..!!

ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల అనంతరం మారిన రాజకీయ సమీకరణాలు ఏపిలో జనసేన, లెఫ్ట్‌ కూటమికి ఆశాజనకంగా మారాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు పోరాడుతున్న విషయం తెలిసిందే. అందులోనూ వచ్చే ఎన్నికల్లో పలు కూటములు ఏపీలో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో సంకర్ణ రాజకీయాలకు అవకాశముందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు ఏపీలో కనీసం నలభై ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకొన్నా సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశముంటుందని, పరిస్థితులు కలిసొస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పవచ్చని వామపక్ష, జనసేన కూటమి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 త్రిముఖ పోరు త‌ప్ప‌దంటున్న జ‌న సైనికులు..! సత్తా చాటుతాం అంటున్న ప‌వ‌న్ ఫాన్స్..!

త్రిముఖ పోరు త‌ప్ప‌దంటున్న జ‌న సైనికులు..! సత్తా చాటుతాం అంటున్న ప‌వ‌న్ ఫాన్స్..!

ఇదిలావుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీచేస్తామని జనసేన పార్టీ వెల్లడించింది. వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు తప్పదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువ‌డుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీచేస్తామని వైసీపీ పేర్కొంది. ఇక కాంగ్రెస్‌ను కలుపుకొని వచ్చే ఎన్నికల బరిలో దిగేలా టీడీపీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. వామపక్షాలతో కలసి వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంచేసారు.
ఇక బీజేపీ కూడా ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగబోతున్న‌ట్టు ఆ పార్టీ జాతీయ అద్య‌క్షుడు అమీత్ షా ఇప్ప‌టికే తెలిపారు.

వామ‌ప‌క్షాల‌తో క‌లుస్తాం..! వారెవ్వా అనిపిస్తామంటున్న జ‌న శ్రేణులు..!!

వామ‌ప‌క్షాల‌తో క‌లుస్తాం..! వారెవ్వా అనిపిస్తామంటున్న జ‌న శ్రేణులు..!!

అయితే బీజేపి ప్రభావం ఏ రకంగా చూసినా వచ్చే ఎన్నికల్లో నామమాత్రమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుంటే ఈ త్రిముఖ పోరు నేపథ్యంలోనే జనసేన, లెఫ్ట్‌ కూటమిలో ఆశలను పెంపొందిస్తున్నాయి. బలమైన మూడు పక్షాలు బరిలోకి దిగితే ఓటర్లు చీలడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, ఏ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని కూడా అంచనా వేయలేమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాన్ని వామపక్ష, జనసేన కుటమి ప్రస్తావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి వ్యతిరేకత ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా అంశం, కాంగ్రెస్‌ పార్టీ తోడైతే ఆ పార్టీకి ఘోరమైన ఓటమి ఏమీ ఉండబోదని రాజకీయ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

వైసీపి నుండి వ‌ల‌స‌లు..! నిలువ‌రించేందుకు జ‌గ‌న్ ఆప‌సోపాలు..!!

వైసీపి నుండి వ‌ల‌స‌లు..! నిలువ‌రించేందుకు జ‌గ‌న్ ఆప‌సోపాలు..!!

ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి జనంలో మంచి ఆదరణయే ఉన్నా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైసీపీకి ఏకపక్ష మెజార్టీ వస్తుందన్న అంశాన్ని ఇప్పటికిప్పుడే అంచనావేయలేమని స్ప‌ష్ట‌మౌతోంది. ఇక వామపక్షాలను కలుపుకొని జనసేన పార్టీ బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ సినీ గ్లామర్‌, కాపు సామాజిక వర్గం అండ కలిసొస్తుందని ఈ కూటమి అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో కనీసంగా నలభై స్థానాలను సొంతం చేసుకొంటే ఆపై ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో తమ పాత్ర కీలకంగా ఉంటుందని వామపక్ష, జనసేన కూటమి అంచనావేస్తోంది. కర్ణాటక తరహా రాజకీయాలు ఇక్కడా ఉత్పన్నమైన ఆశ్చర్యపోనక్కర్లేదని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితులను అవకాశంగా మల్చుకోవాలని లెఫ్ట్‌, జనసేన కూటమి భావిస్తున్నట్లు సమాచారం. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏపిలో జ‌న‌సేన పావులు క‌దుపుతున్న‌ట్ట‌గు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+