Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"గోదావరి" లో లెక్క మారుతోంది, కలిసొచ్చేదెవరికి - గ్రౌండ్ రియాల్టీ ఇలా..!!

ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలు కీలకం. ఈ సారి చంద్రబాబు, పవన్ ఈ రెండు జిల్లాల పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. రెండు పార్టీలు కలిసి వస్తే బీజేపీతో ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని ఆశిస్తున్నారు. రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. త్యాగరాజులుగా మిగిలేది ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ సారి సామాజిక సమీకరణాలు కీలకం అవుతున్నాయి. ఈ సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

సీట్ల కోసం పోటా పోటీ : తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో టీడీపీ 4 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తుతో మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమా ఆ రెండు పార్టీల్లో వ్యక్తం అవుతుంది. ఇదే జిల్లాలో జనసేనకు 2019 ఎన్నికల్లో 14 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ జిల్లాలోనే పవన్ పొత్తులో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఇటు టీడీపీ నుంచి ఈ సారి ఆశావాహుల సంఖ్య ఎక్కువగాఉంది. రాజోలు, రాజానగరం ఇప్పటికే జనసేనకు ఖరారయ్యాయి. వీటికి తోడు కాకినాడ రూరల్‌, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్‌, ముమ్మిడివరం వంటి సీట్లు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. కొత్తపేట, రామచంద్రాపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావహులు ఒత్తిడి పెంచుతున్నారు. టికెట్లు ఇంకా కేటాయించకపోయినా పిఠాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Jana Sena likely to seek 12 to 14 Assembly seats out of total 34 in Godavari districts

నువ్వా నేనా : జనసేన కోరుతున్న స్థానాల్లో టీడీపీకి సీనియర్ నేతలు ఉన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి సీటు కోసం పట్టు పడుతున్నారు. రాజమండ్రి రూరల్‌ను ఖాళీ చేయాలంటే రాజమండ్రి సిటీ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ సీటు జనసేనకు ఇస్తే ఆయన మరోసారి స్వతంత్రంగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ముమ్ముడి వరం జనసేన అభ్యర్దిగా పితాని బాలకృష్ణ బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే, ఇక్కడ టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చిబాబు పోటీకి రెడీగా ఉన్నారు. రాజోలు సీటు జనసేనకు కేటాయించారు. అక్కడ టిడిపి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుయాయుల సహకారంపై అనుమానాలు ఉన్నాయి. రాజానగరంలో ఇప్పటికే ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో టిడిపి శ్రేణులు కాకినాడ రూరల్‌లో జనసేన అభ్యర్ది పంతం నానాజీకి టిడిపి నాయకులు సహకారం అందించడం లేదు.

Jana Sena likely to seek 12 to 14 Assembly seats out of total 34 in Godavari districts

సహకారం ఉండేనా : ఇక, ఇప్పుడు బీజేపీ పొత్తులో కలిస్తే ఆ పార్టీకి జిల్లాలో రెండు స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. టీడీపీ, జనసేన మధ్యనే ప్రస్తుతం ఆశావాహుల మధ్య పోటీ కొనసాగుతోంది. ఇక టికెట్లు ప్రకటించిన తరువాత నేతల మధ్య సయోధ్య పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి, ఇప్పటికే రెండు పార్టీలు పోటీ చేసే స్థానాల పైన సంకేతాలు ఇస్తున్నారు. కానీ, ఆశావాహులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన సీట్లను ఆశిస్తోంది. టీడీపీ 10 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, క్షేత్ర స్థాయిలో ఒక పార్టీకి అభ్యర్దిని కేటాయిస్తే రెండో పార్టీ నుంచి సహకారం ఉంటుందా.. ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+