జయసుధ సికింద్రాబాద్‌లో..: టి పవన్ కళ్యాణ్ షెడ్యూల్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో 25 నుండి 28వ తేదీ వరకు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారం షెడ్యూల్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. ఆయన నాలుగు రోజుల పాటు తెలంగాణలో బిజెపి-టిడిపి కూటమికి ప్రచారం చేయనున్నారు.
25వ తేదీ
మధ్యాహ్నం ఒకటి గంటలకు బిజెపి అభ్యర్థి శ్రీవర్ధన్ రెడ్డికి, గం.2.30కు కల్వకుర్తిలో బిజెపి అభ్యర్థి పి చారీ తరఫున, సాయంత్రం నాలుగు గంటలకు టిడిపి అభ్యర్థి వెంకటేష్ గౌడ్ తరఫున సికింద్రాబాదులో, సాయంత్రం ఐదున్నర గంటలకు బిజెపి అభ్యర్థి రామచంద్రా రెడ్డి తరఫున ఖైరాతాబాద్‌లో, రాత్రి ఏడు గంటలకు టిడిపి అభ్యర్థి అరికలపూడి గాంధీ తరఫున శేరిలింగంపల్లిలో పవన్ ప్రచారం చేస్తారు.

26వ తేదీ
ఉదయం 11 గంటలకు రామగుండంలో, పన్నెండున్నర గంటలకు బిజెపి అభ్యర్థి ఆకుల విజయ్ తరఫున సిరిసిల్లలో, మధ్యాహ్నం రెండు గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్యాసాగర రావు తరఫున, మధ్యాహ్నం మూడున్నర గంటలకు వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర రావు తరఫున ప్రచారం చేస్తారు.
27వ తేదీ
ఉదయం 11 గంటలకు టిడిపి అభ్యర్థి తీగల కృష్ణా రెడ్డి తరఫున మహేశ్వరంలో, టిడిపి సిఎం అభ్యర్థి ఆర్ కృష్ణయ్య తరఫున ఎల్బీనగర్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు, టిడిపి అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరఫున సనత్ నగర్లో రెండున్నర గంటలకు, ముషీరాబాద్‌లో బిజెపి అభ్యర్థి కె లక్ష్మణ్ తరఫున సాయంత్రం నాలుగు గంటలకు, అంబర్ పేటలో కిషన్ రెడ్డి తరఫున సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం చేస్తారు. ఈ నియోజకవర్గాలు అన్ని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. బిజెపి తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నారు.
28వ తేదీ
ఉదయం 11 గంటలకు బిజెపి అభ్యర్థి లక్ష్మా రెడ్డి తరఫున ఎల్లారెడ్డిలో, పన్నెండున్నర గంటలకు కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి సిద్దిరాములు తరఫున, రెండు గంటలకు బాల్కొండ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications