బాబుతో పవన్! వ్యూహరచన: ఫ్రెండ్ ఇలాకాలో రాహుల్

హైదరాబాద్/నిజామాబాద్/శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారని సమాచారం. పవన్ టిడిపి, బిజెపిలకు ప్రచారం చేయనున్న నేపథ్యంలో వారు ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారని తెలుస్తోంది.

కాగా, చంద్రబాబు సోమవారం చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఆయన రేణిగుంట చేరుకుంటారు.

మధ్యాహ్నం 12.10 గంటలకు ఎస్సార్ పురంలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 3 గంటలకు పూతలపట్టు నియోజకవర్గం అరగొండలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడతారు. చివరిగా చంద్రగిరిలో జరిగే బహిరంగసభలో పాల్గొని, అక్కడి నుంచి తిరుపతి వెళ్లి రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహిస్తారు.

Jana Sena Party chief Pawan to meet Chandrababu

శ్రీకాకుళంలో బాలయ్య

టిడిపి నేత నందమూరి బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నరసన్నపేట నియోజకవర్గం సారవకోట చేరుకుంటారు.

పదకొండున్నరకు రోడ్ షోలో పాల్గొని అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నరకు పోలాకిలో జరిగే రోడ్ షో, బహిరంగసభలో పాల్గొంటారు. రెండు గంటలకు ఉర్లాంలో, మూడు గంటలకు ఆముదాలవలస నియోజకవర్గంలోని భృజకొల్లివలస జంక్షన్ లో జరిగే రోడ్ షోలో పాల్గొని అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఇక సింగుపురంలో ఆరు గంటలకు, శ్రీకూర్మంలో ఏడున్నర గంటలకు, శ్రీకాకుళం పట్టణంలో ఎనిమిదిన్నర గంటలకు జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు.

నేడు టిలో రాహుల్ పర్యటన

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ రోజు (సోమవారం) మహబూబ్ నగర్, నిజమాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రాహుల్ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మహబూబ్ నగర్, సాయంత్రం నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ నుండి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా.. నిజామాబాద్ నుండి రాహుల్ సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కి పోటీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+