షాకింగ్: 'జనసేనతో టచ్‌లో 40మంది టీడీపీ నేతలు, బాబుకు తెలుసు, లోకేష్ అవినీతిపై పవన్ వద్ద ఆధారాలు'
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొన్న భూమిపై విమర్శలు రావడంపై ఆ పార్టీ స్పందించింది. భూమికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇప్పుడు జనసేన కూడా ఈ భూమిపై ప్రకటన చేసింది. అదే సమయంలో కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన విషయం వెల్లడించింది. ఇది ఏపీ రాజకీయాలను మరింత కుదిపేసేలా ఉంది.

జాతీయ రహదారుల దిగ్బంధానికి మద్దతు
జాతీయ రహదారుల దిగ్బంధానికి జనసేన మద్దతు ఇస్తుందని ఆ పార్టీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కొన్న భూములపై విమర్శలు రావడంతో దానిపై కూడా స్పందించింది.

అన్నింటికి సమాధానం చెబుతాం
పవన్ కళ్యాణ్ కొన్న భూములకు లెక్కలు ఉన్నాయని ఆ పార్టీ తెలిపింది. రైతుల దగ్గరే పవన్ భూములు కొన్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న దుష్ప్రచారానికి సరైన సమాధానం చెబుతామన్నారు.

లోకేష్ అవినీతిపై ఆధారాలు
మంత్రి నారా లోకేష్ అవినీతిపై పవన్ కళ్యాణ్ వద్ద ఆధారాలు ఉన్నాయని జనసేన తెలిపింది. లోకేష్ అవినీతి పైన ఢిల్లీ స్థాయి ఏజెన్సీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని తెలిపారు.

40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో
40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల వారసులు తమతో టచ్‌లో ఉన్నారని జనసేన పార్టీ బాంబు పేల్చింది. ఆ ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసునని చెప్పారు.












Click it and Unblock the Notifications